కోతులకు భయపడి.. కాలువలో పడి.. | - | Sakshi
Sakshi News home page

కోతులకు భయపడి.. కాలువలో పడి..

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

కోతులకు భయపడి.. కాలువలో పడి..

● బట్టలు ఉతుకుతూ మహిళ గల్లంతు

● కాపాడేందుకు కొడుకు ప్రయత్నం విఫలం

● తణుకులో పెళ్లింట విషాదం

తణుకు అర్బన్‌: కాలువలో బట్టలు ఉతుకుతూ కోతుల అలజడికి భయపడిన మహిళ అదుపుతప్పి గల్లంతైన ఘటన తణుకులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు 20వ వార్డు చక్కా వారి వీధిలో నివసిస్తున్న కొచ్చెర్ల పద్మ తులసి (53) శుక్రవారం సాయంత్రం తన నివాస ప్రాంతం స్టేట్‌ బ్యాంక్‌ సమీపంలోని గోస్తనీ కాలువ రేవులో బట్టలు ఉతుకున్నారు. అదే సమయంలో కాలువ రేవును ఆనుకుని ఉన్న రావిచెట్టుపై ఉన్న కోతుల గుంపు మీదకు వచ్చే క్రమంలో భయపడి ఆమె వేసిన వెనుకడుగుతో కాలువలోకి కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న ఆమె కుమారుడు సైతం కాలువలోకి దిగినా కాపాడలేక పోగా అతను కూడా ప్రమాద పరిస్థితుల్లోకి వెళ్లగా వెంటనే సమీపంలో ఉన్న వ్యక్తి బయటకు లాగారు. దీంతో స్థానికంగా ఉన్న వారితోపాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మహిళ జాడ కోసం ప్రయత్నించినా నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఫలితం లేకపోయింది.

అమ్మా.. అమ్మా.. అంటూ రోదనలు

కాలువ రేవు వద్దే ఉన్న కుమారుడు వీర వెంకట నాగ సత్యనారాయణ (సతీష్‌) తల్లి కొట్టుకుపోవడాన్ని స్వయంగా చూసి ఈత రానప్పటికీ కాలువలోకి దూకి నట్టు స్థానికులు చెబుతున్నారు. తల్లి పూర్తిగా నీటిలో మునిగిపోగా సతీష్‌ కూడా నీటిలో గల్లంతయ్యే పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న కిరణ్‌ అనే వ్యక్తి కాపాడినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం నుంచి బయటపడ్డ సతీష్‌ అమ్మా అమ్మా అంటూ చేసిన రోదనలు మిన్నంటాయి.

ఇటీవలే కుమార్తె వివాహం

పద్మ తులసికి భర్త చిదంబరంతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిదంబరం బంగారం తయారీ పనిచేస్తుండగా, కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నారు. గతనెలలో కుమార్తె వివాహం జరగ్గా ఇల్లంతా పెళ్లి సందడితో ఉన్న సమయంలో ఇటువంటి ప్రమాదం చోటుచేసుకోవడం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మి గిల్చింది. ఈ ప్రాంతంలో కోతుల బాధ అధికంగా ఉందని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని, గతంలో ఒకసారి కో తులను పట్టుకున్నారని కానీ మరలా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోతులు మీదకు వస్తున్నాయనే భయంతోనే పద్మ తులసి కాలువలోకి వెనక్కి అడుగువేసిందని, దీంతో ఆమెకాలువలోకి కొట్టుకుపోయిందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement