రోడ్డు ఆక్రమణల తొలగింపునకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ఆక్రమణల తొలగింపునకు చర్యలు

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

ఆశావర్కర్‌పై లైంగిక వేధింపులు? రోడ్డు ఆక్రమణల తొలగింపునకు చర్యలు

ఆశావర్కర్‌పై లైంగిక వేధింపులు?
ఆశావర్కర్‌పై ఏలూరు జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో ఓ ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు పాల్పడటం దుమారం రేపుతోంది. 8లో u

కలెక్టర్‌ నాగరాణి

భీమవరం అర్బన్‌: భీమవరం నుంచి లోసరి వరకు రహదారి నిర్మాణానికి అవసరమైన ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను శుక్రవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భీమవరం–లోసరి రహదారి నిర్మాణానికి సీఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి రూ.43 కోట్లు మంజూరయ్యాయన్నారు. నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. నిబంధనల ప్రకారం ఆక్రమణలను తొలగించి రహదారి నిర్మాణానికి స్థలాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. పట్టణ పరిధిలోని డీఎన్నార్‌, కేజీఆర్‌ఎల్‌ కళాశాల వద్ద వంతెన అప్రోచ్‌, రోడ్లు నిర్మాణానికి రూ.17.45 కోట్లు, గొల్లవానితిప్ప–రామాయణపురం వరకు రహదారి విస్తరణకు రూ.7.25 కోట్లు, తోకతిప్ప–నాగేంద్రపురం వద్ద యనమదుర్రు డ్రెయిన్లపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 8 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. అప్రోచ్‌ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణ ప్రాంతాలను ఆమె పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నిర్దేశిత ప్రమాణాలు, నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాసులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement