ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఖరీఫ్‌ 2026–27 సీజన్‌లో రైతుల నుంచి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు సజావుగా కొనుగోలు చేసేందుకు పటిష్ట చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.ఆర్‌. కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై ఆమె సమావేశం నిర్వహించారు. కామన్‌ వైరెటీ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,441, గ్రేడ్‌–ఏ రకానికి రూ.2,461 కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు మూడు రోజుల్లో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని, తూనికలు, కొలతల పరికరాలను పరిశీలించి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం కొలిచే మీటర్ల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రైస్‌ మిల్లర్లు తమ డిక్లరేషన్‌ ప్రక్రియను మూడు రోజుల్లో ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం రవాణాకు వినియోగించే వాహనదారులు కొనుగోలు కేంద్రాల్లో వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ధాన్యం ధరతో పాటు రవాణా చార్జీలను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఈ–క్రాప్‌ 87 శాతం, ఈ–కేవైసీ 71 శాతం మా త్రమే పూర్తయిందని, ఈనెల 25లోగా నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధరపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. డీఎం ఇబ్రహీం, డీఎస్‌ఓ ఎన్‌.సరోజ, డీఏఓ జి.సునీత, డీసీఓ ఎస్‌.మురళీకృష్ణ పాల్గొన్నారు.

జేసీ కల్పశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement