కొల్లేరులో రాజకీయ వేడి | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో రాజకీయ వేడి

Sep 18 2026 2:21 AM | Updated on Sep 18 2026 2:21 AM

సాక్షి, టాస్క్‌ఫోర్సు: కొల్లేరులో కొత్త రాజకీయ పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్లేరు గ్రామానికి చెందిన స్థానికుడికే జెడ్పీటీసీ స్థానం కేటాయించాలనే ప్రధాన డిమాండ్‌తో కై కలూరు మండలం వడ్లకూటితిప్ప గ్రామంలో కై కలూరు, మండవల్లి, పైడిచింతపాడు మండలాల కొల్లేరు పెద్దలు గురువారం కీలక సమావేశం నిర్వహించారు. కొట్టాడ గ్రామానికి చెందిన వడ్డీ సాధికారిక కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ బలే ఏసురాజుకు జెడ్పీటీసీ అవకాశం కల్పించాలని, ఈ విషయాన్ని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. కొల్లేరు గ్రామాల ప్రజలందరి తరఫున తనకు అవకాశం కల్పించాలని బలే ఏసురాజు సైతం సభలో తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఫోన్‌ చేసి, కొల్లేరు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అందరూ ఏకాభిప్రాయంతో ఎన్నుకునే అభ్యర్ధికి తగిన న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్లేరు పెద్దలు సైదు సత్యనారాయణ, నబిగారి రాంబాబు, జయమంగళ సుబ్బరాజు, సైదు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం అందరికీ విందు ఏర్పాటు చేశారు.

కూటమిలో కుమ్ములాటలకు ఆజ్యం?

కూటమిలో స్థానిక సంస్థల జెడ్పీటీసీ అభ్యర్థిత్వం కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొందరు ఇంకా బయటపడకుండా, సరైన సమయం చూసి తమ అభిప్రాయం చెప్పాలని భావిస్తున్నారు. కై కలూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా బీసీ సామాజికవర్గానికి చెందిన బూరుబోయిన శ్రీనివాసరావు పేరు గట్టిగా వినిపిస్తోంది. అదేవిధంగా ముదునూరి లింగరాజుకు జెడ్పీటీసీ లేదా ఎంపీపీగా అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పోటీ మరింత తీవ్రతరం కానుంది. ఇదిలాఉంటే, కొల్లేరు వడ్డీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఈ కీలక సమావేశానికి హాజరుకాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై వడ్లకూటితిప్పలో కొల్లేరు పెద్దల సమావేశం

బలే ఏసురాజుకు జెడ్పీటీసీ కోసం తీర్మానం

కూటమిలో కుమ్ములాటలకు ఆజ్యం

హాజరుకాని ఎమ్మెల్సీ జయమంగళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement