శునకాన్ని తప్పించబోయి.. యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

శునకాన్ని తప్పించబోయి.. యువకుడి దుర్మరణం

Sep 18 2026 2:21 AM | Updated on Sep 18 2026 2:21 AM

ఉంగుటూరు, పొలకొల్లు సెంట్రల్‌ : రోడ్డుపై అకస్మాత్తుగా అడ్డువచ్చిన శునకాన్ని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన ఉంగుటూరు మండలం కై కరం శివారులో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామానికి చెందిన దొంగ చైతన్య ప్రకాష్‌ (27), పోడూరు మండలం జున్నూరు గ్రామానికి చెందిన జుత్తిగ చిన్న వెంకటేశులుతో కలిసి ద్విచక్రవాహనంపై ద్వారకాతిరుమల క్షేత్ర దర్శనానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ కై కరం శివారులోకి రాగానే, ఒక్కసారిగా రోడ్డుపైకి శునకం అడ్డుగా వచ్చింది. దీంతో వేగంగా వస్తున్న బైక్‌ శునకాన్ని ఢీకొని అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్‌ వెనుక సీటులో కూర్చున్న చైతన్య ప్రకాష్‌కు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌ నడుపుతున్న చిన్న వెంకటేశు తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ దుర్ఘటనలో శునకం కూడా అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఉంగుటూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శోకసంద్రం

దొంగ చైతన్య ప్రకాష్‌, జుత్తిగ చిన్న వెంకటేశులు మేనత్త మేనమామ బిడ్డలు. వెంకటేశ్వర్లు ఈ నెలాఖరు లోపు సింగపూర్‌ వెళ్లవలసి ఉంది. గురువారం ద్వారకాతిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుని వద్దామని చెప్పగా అతనితో చైతన్య కూడా వెళ్లాడు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనలో చైతన్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడు చైతన్య తండ్రి కోటేశ్వరరావు వ్యవసాయం పనులు చేస్తుంటాడు. ఆయనకు చైతన్యతో పాటు, కుమార్తె ఉన్నారు.

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement