డిమాండ్ల సాధనకు వీఆర్‌ఏల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

డిమాండ్ల సాధనకు వీఆర్‌ఏల పోరుబాట

Sep 18 2026 2:21 AM | Updated on Sep 18 2026 2:21 AM

ఉండి : మా బాధలు పట్టించుకునేదెవరు? మమ్మల్ని ఆదుకునేదెవరు? ఇప్పటికే అప్పులపాలైపోయాము.. నమ్ముకున్న వృత్తిని విడిచిపెట్టలేక కొనసాగుతున్నాము.. దయచేసి ఇప్పుడైనా మమ్మల్ని ఆదుకోండి బాబూ... అంటూ వీఆర్‌ఏలు కన్నీటిపర్యంతమయ్యారు. గురువారం ఉండి తహసీల్దార్‌ కార్యాలయం ముందు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జేఏసీ పిలుపుమేరకు వీఆర్‌ఏలు సహాయ నిరాకరణ సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామంటూ వారు కాలుదువ్వుతున్నారు.

ప్రధాన డిమాండ్లు

వీఆర్‌ఏలు అందరికీ తెలంగాణా మాదిరి పేస్కేలు అమలు చేయాలి. నామినీ వీఆర్‌ఏలను రెగ్యులర్‌ వీఆర్‌ఏలుగా గుర్తించాలి. వన్‌టైం సెటిల్‌మెంట్‌గా గ్రేడ్‌ టూ వీఆర్‌ఓలుగా పదోన్నతి కల్పించాలి. అటెండర్‌, నైట్‌ వాచ్‌మెన్‌, డ్రైవర్‌ పోస్టుల ప్రమోషన్‌ కోటా ఇంత వరకు 20 శాతం మాత్రమే ఉండగా దానిని 70 శాతం పెంచాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు.

వీఆర్‌ఏల వివరాలు

● ఉమ్మడి జిల్లాలో వీఆర్‌ఏలు సుమారు 1,200

● పదోన్నతికి అవకాశం ఉన్నవారు సుమారు 800

నామినీలుగా పనిచేస్తున్న వారు సుమారు 150

● గ్రేడ్‌ టూ వీఆర్వోలుగా పదోన్నతికి అర్హులు సుమారు 500

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement