భీమవరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాస్థాయి జూనియర్, సీనియర్ ఆర్చరీ పోటీలు నిర్వహించారు. జిల్లా జట్లను ఎంపిక చేశారు. 8లో u
భీమవరం అర్బన్: గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నా రు. మండలంలోని రాయలం గ్రామంలో బై పాస్ రోడ్డులో బుధవారం స్వచ్ఛపథం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పరిశుభ్ర తపై అవగాహన తప్పనిసరి అని, అందరూ బాధ్యతగా పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలన్నారు. రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో, కాలువల్లో చెత్త వేయకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆమె చెత్తను శుభ్రం చేశారు. డీఎస్‌డబ్ల్యూఓ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ మురళీ గంగాధరరావు, పంచాయతీ ఈవో పి.వీర్రాజు ఉన్నారు.
నేటి నుంచి స్వచ్ఛతా హీ సేవ
భీమవరం (ప్రకాశంచౌక్): పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా పెంపొందించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం నుంచి కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో గురువారం నుంచి వచ్చేనెల 17 వరకు స్వచ్ఛత హీ సేవా–2026 కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.


