ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఏలూరు కుర్రాడు | - | Sakshi
Sakshi News home page

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఏలూరు కుర్రాడు

Aug 26 2026 1:36 AM | Updated on Aug 26 2026 1:36 AM

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఏలూరు కుర్రాడు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరుకు చెందిన బైకింగ్‌ ప్రేమికుడు కడలి లక్ష్మీనారాయణ తన మిత్రులు భరద్వాజ్‌, వినోద్‌లతో కలిసి సాహసయాత్ర చేపట్టారు. బైక్‌పై ఉన్న అభిరుచితో వీరు కేవలం 10 రోజుల్లోనే (2025 డిసెంబర్‌ 6 నుంచి 16 వరకు) 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ సుమారు 4,500 కిలోమీటర్ల మేర దక్షిణ భారత తీర ప్రాంతాన్ని చుట్టివచ్చారు. వాతావరణ మార్పులు, రోడ్డు పరిస్థితులు వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. ఈ ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ – 2026 సంస్థ వీరిని ’ఐబీఆర్‌ అచీవర్స్‌’గా ప్రకటించింది. ఇటీవల వీరికి నిర్వాహకులు సర్టిఫికెట్‌, మెడల్‌ను అందజేశారు. ఈ విజయాన్ని తన పుట్టిన గడ్డ అయిన ఏలూరుకు అంకితం చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తితో మరిన్ని సాహసయాత్రలు చేస్తామని వారు చెప్పారు. రికార్డు సాధించిన ఈ యువకులను బంధుమిత్రులు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement