భీమవరం : పోలీస్‌స్టేషన్ వచ్చే ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 మంది బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. నిర్ణీత గడువులోపు బాధితులకు న్యాయం జరగాలని అధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సామాన్యుల సమస్యల పట్ల స్పందించడంలో అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్) : తాడేపల్లిగూడెం డీ ఆర్‌జీ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 29న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. సో మవారం కలెక్టరేట్‌లో డ్రైవ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 900 పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, 18–35 ఏళ్ల వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 8367054119, 7013896277 నంబర్లలో సంప్రదించాలని కోరారు. జేసీ కల్పశ్రీ డీఆర్వో పి.ప్రభాకర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్ పాల్గొన్నారు.
వర్మీ కంపోస్ట్ స్టాల్ ప్రారంభం
డీపీఆర్‌సీ పంచాయతీల్లో తయారుచేసిన వర్మీ కంపోస్ట్‌కు సంబంధించిన స్టాల్‌ను కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. కలెక్టరేట్‌లో స్టాల్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్‌ను రైతులు వినియోగించాలన్నారు. స్టాల్‌లో కిలోతో పాటు బల్క్‌గా ప్యాకింగ్‌లు చేయాలన్నారు. ఇక్కడి స్టాల్‌పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీపీఓ కె.అనురాధ తదితరులు పాల్గొన్నారు.
నేత్రదానం మహోన్నతం
ప్రజల్లో నేత్రదానంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జాతీయ అంధత్వ నివారణ, దృష్టి లోప నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. జిల్లా ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ కీర్తి కిరణ్, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
భీమవరం : ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తు న్న టెట్‌ను వ్యతిరేకిస్తున్నట్టు ఉభయగోదావ రి జిల్లాల టీచర్ ఎమ్మె ల్సీ బొర్రా గోపిమూర్తి తెలిపారు. భీమవరంలో సోమవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ విలేకరులతో ఆయన మాట్లాడారు. సాధారణ టెట్‌కు ప్రత్యేక టెట్‌కు ఎలాంటి తేడా లేదని, దీనిని ఉపాధ్యాయులంతా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పా రు. ఉపాధ్యాయుల మానసిక వేదనను అర్థం చేసుకుని, ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు తగిన వెసులుబాటులు, మినహాయింపులు ఇవ్వాలని ఆయన కోరారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్‌లోని ఎర్త్ కం రాక్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్)లో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్) నిపుణులు సోమవారం కూడా పరీక్షలు నిర్వహించారు. బృందంలో సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీహరి టి నాయర్ , అమిత్ సేన్ పాల్గొనగా పోలవరం ప్రాజెక్ట్ ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డీజీఎంలు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య, జలవనరుల శాఖ ఈఈ డి.శ్రీనివాస్, డీఈఈలు నిర్మల, శ్రీనివాస్, శేఖర్ బాబు వారికి వివరాలు అందజేశారు. నీరు ప్రవహించే వేగాన్ని కొలిచారు, నేల గట్టిదనం తెలుసుకునే పరీక్షలు చేశారు. కొన్ని నమూనాలు ఇక్కడ ల్యాబ్‌లో, మరికొన్ని ఢిల్లీలో పరిశోధనాలయంలో లోతుగా పరీక్షించి తుది నివేదికలను సిద్ధం చేయనున్నారు.


