ముసునూరు: ఉప రాష్ట్రపతి ముసునూరు మండల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకష్ణన్, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటనలకు సంబంధించి శాఖల వారీగా కేటాయించిన పనులపై సమీక్షించారు. సోమవారం ముసునూరులోని గోర్‌మే పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరిస్తారన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తిచేసి, విజయవంతం చేయాలని ఆదేశించారు. హనుమాన్ జంక్షన్ నుంచి ముసునూరులో సభాస్థలి వరకు పశువులు, మూగజీవాలు కాన్వాయ్‌లకు అడ్డురాకుండా చూడాలన్నా రు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడి పాల్గొన్నారు.
భీమవరం: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న భీమవరం అనసూయ చెస్ అకాడమీలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసు కిషోర్ తెలిపారు. విజేతలకు రూ.25 వేల విలువగల చదరంగ పుస్తకాలను బ హుమతులుగా అందిస్తామన్నారు. అండర్ 7, 9, 11, 13, 15 బాలబాలికల గ్రూపులో విజేతలకు షీల్డ్స్, మెడల్స్ కూడా ఇస్తామని, వివరాలకు 90632 24466లో సంప్రదించాలని కోరారు.


