అక్రమ కేసులు, ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్‌లు చేస్తూ కక్ష సాధింపు రాజకీయాలు నడుపుతున్న కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక చంద్రబాబు సర్కారు అక్రమ కేసును బనాయించి కారుమూరిని అరెస్ట్ చేసింది. బీసీ నాయకులపై పగబట్టారు.
– ముదునూరి ప్రసాదరాజు,
వైఎస్సార్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు
వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపులు పరాకాష్టకు చేరా యి. కూటమి ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే మాజీ మంత్రి కారుమూరిని అరెస్ట్ చేయించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా, అసలు లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటి చర్యలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదు.
– కంభం విజయరాజు,
చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి
బీసీ వర్గానికి చెందిన కారుమూరిని అక్రమ కేసులో అరెస్టు చేయడం కూటమి దుర్మార్గపు చర్యగా భావించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి రాజకీయంగా బీసీలను అణగదొక్కాలనే ఉద్దేశంతో వేధింపులు, దాడులకు దిగుతోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా కారుమూరి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.
– నౌడు వెంకటరమణ,
వైఎస్సార్‌సీపీ స్టేట్ బీసీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్


