మంచినీటి చెరువులో గుక్కెడు నీళ్లు కూడా గొంతులో పోసుకోవడానికి అవకాశం లేదు. చెరువులోని నీరు పూర్తిగా కలుషితమైంది. అయినప్పటికీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికై నా చెరువును అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందజేయాలి.
– కె.దుర్గారావు, చావలిపాడు
అస్తవ్యస్తంగా ఉన్న మంచినీటి చెరువును వెంటనే అభివృద్ధి చేయాలి. ఇది పేరుకే మంచినీటి చెరువు, కానీ ఈ నీటిని ఏవిధంగానూ ప్రజలు వినియోగించే అవకాశం లేదు. గుక్కెడు నీటిని గొంతులో పోసుకుంటే వ్యాధులు రావడం ఖాయం. ఉన్నతాధికారులు స్పందించి చెరువును బాగుచేసి శుభ్రమైన తాగునీటిని అందించాలి. – ఆర్.రామారావు, చావలిపాడు


