గూడు.. గోడు | - | Sakshi
Sakshi News home page

గూడు.. గోడు

Aug 23 2026 12:52 AM | Updated on Aug 23 2026 12:52 AM

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం

కూటమి ప్రభుత్వంలో నిర్మాణాలు

గత ప్రభుత్వంలో 70 వేలకు పైగా ఇళ్ల మంజూరు

భీమవరం(ప్రకాశం చౌక్‌): రాష్ట్రంలో చంద్రబాబు కూటమి పాలనలో గ్రామీణ ప్రజలకు ‘గృహ’యోగం కలగడం లేదు. ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లు దాటినా జిల్లాలో ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయకపోవడం పేదల సంక్షేమంపై నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో పేదల సొంతింటి కల సాకారం కావడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు భూమి చొప్పున మంజూరు చేయగా.. వేలాది ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. కొందరికి స్థలాలు మంజూరు కాగా ఇళ్ల నిర్మాణాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఇళ్ల ఊసే ఎత్తడం లేదు. దీంతో అద్దె ఇళ్లలోనూ కాలం గడుపుతున్నారు. కొందరు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా బిల్లులు రావడం లేదు.

పట్టణాలకు మాత్రమే 595 ఇళ్లు : చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా జిల్లాలో పట్టణాలకు 595 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది. వీటిలో 57 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 2014 నుంచి 2019 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం చూపుతుందని లబ్ధిదారులు వాపోయారు. అప్పట్లో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి గృమాలు మంజూ రు కూడా అరకొరగా ఉంది. అది కూడా టీడీపీ నా యకులు, అనుయాయులకే ప్రాధాన్యమిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

నిర్మాణాలకూ వెనుకడుగు

వేసవి కాలం ఇళ్ల నిర్మాణాలకు అనుకూలం. ఏటా జనవరి నుంచి జూన్‌ వరకు నిర్మాణ పనులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో నిర్మాణాలు చేపడదామని ఆలోచిస్తున్న పేదలకు ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదు. దీంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అక్కడక్కడా కొందరు మాత్రమే అప్పులు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. చాలా చోట్ల గ్రామాల్లో గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ల స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. బెస్‌మెంట్‌, దశల వా రీగా నిర్మాణాలు చేపట్టినా బిల్లులు వస్తాయో రావో అన్న సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు.

యూనిట్‌ కాస్ట్‌ పెంచాలి : పెరుగుతున్న భవన నిర్మాణ సామగ్రి ధరల దృష్ట్యా ఇంటి యూనిట్‌ కాస్ట్‌ పెంచాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం యూనిట్‌ కాస్ట్‌ రూ.1.80 లక్షలు ఉండగా కనీసం రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచాలని స్థలాల లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇళ్ల మంజూరు 72,059

తొలి రెండేళ్లలో పూర్తయినవి 15 వేలు

శ్లాబ్‌ పూర్తయినవి 1,513

శ్లాబ్‌ దశకు వచ్చినవి 2,025

పలు దశల్లో నిర్మాణాలు 34,000

గ్రామాల్లో ఇళ్ల మంజూరు నిల్‌

పట్టణాలకు ఇళ్ల మంజూరు 595

వాటిలో పూర్తయినవి 57

నిర్మాణంలో ఉన్నవి 224

అనుగృహమెప్పుడో..?

ఇళ్ల మంజూరు కోసం పేదల ఎదురుచూపులు

గ్రామీణ ప్రాంతాలకు ఇళ్ల మంజూరు నిల్‌

రెండేళ్లలో పట్టణాలకు కేవలం 595 ఇళ్లు మంజూరు

వాటిలో నిర్మాణం పూర్తయినవి 57 గృహాలే..

ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం

ఏఐ సృష్టించిన చిత్రం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. జగనన్న లేవుట్‌లు, సొంత స్థలాలు మొత్తంగా సుమారు 70 వేల ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 30 వేల నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారం చేపట్టిన తొలి రెండేళ్లలోనే 15 వేల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. వేలాది ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో సుమారు 6 వేల నిర్మాణాలు చంద్రబాబు పాలనలో పూర్తికాగా.. చంద్రబాబు తన మంత్రులు, అధికారులతో గృహప్రవేశాలు చే యించి వాటిని తానే మంజూరు చేసినట్టు గొప్పులు చెప్పుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement