వైఎస్సార్‌సీపీ నేతలపై అరకమ కేసులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలపై అరకమ కేసులు

Aug 23 2026 12:52 AM | Updated on Aug 23 2026 12:52 AM

నిట్‌కు కొత్త డైరెక్టర్‌ వైఎస్సార్‌సీపీ నేతలపై అరకమ కేసులు

నిట్‌కు కొత్త డైరెక్టర్‌
ఏపీ నిట్‌కు నాలుగేళ్ల తర్వాత కొత్త డైరెక్టర్‌గా ముంబై ఐఐటీ ప్రొఫెసర్‌ కృష్ణారావు రానున్నారు. అక్టోబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 8లో u

పాలకొల్లు సెంట్రల్‌: గతేడాది యలమంచిలి ఎంపీపీ ఎన్నికల సమయంలో పెట్టిన కేసులకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నాయకులకు కోర్టు సమన్లు వ చ్చాయి. శనివారం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నికల్లో తమపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కూటమి నాయకులే తమ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేశారని, అయినా తమ నాయకులు వైఎస్‌ జగన్‌పై నమ్మకంతో నిజాయితీగా నిలిచారన్నారు. దీనిని జీర్ణించుకోలేని కూటమి నేతలు అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణమన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. కేసులకు భయపడబోమని, కూటమి అక్రమాలను నిలదీస్తూనే ఉంటామన్నారు. ఇటీవల పాలకొల్లు ఏరి యా ఆస్పత్రి అభివృద్ధి పనుల్లో చెత్తను తీసుకువచ్చి డంప్‌ చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించామని, దీంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఆస్పత్రి ఘటనపై కూడా తమ నాయకులపై సీఐడీ కేసులు పెట్ట డం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇప్పటివరకూ పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, చిలువూరి కుమారదత్తాత్రేయ వర్మ, ఉచ్చుల స్టాలిన్‌, కోరాడ శ్రీను, పాలపర్తి కృపానాథ్‌, బండి రమేష్‌, రేలంగి శ్రీను, చెన్ను విజయ్‌, గుంటూరు పెద్దిరాజు, మద్దా చంద్రకళ, మోకా ప్రేమ్‌చంద్‌, కుక్కల బాలచందర్‌, మ ల్లుల కొండ, మందా హరికుమార్‌, పాలంకి శ్రీను, పోలుకొండ వెంకట్‌, శంకరావు శ్రీను, పాలపర్తి సందీప్‌, కొయ్యే నాగేశ్వరరావు, అడబాల రాము, గందం సత్యకీర్తిలకు కోర్టు నుంచి సమన్లు వ చ్చాయన్నారు. కోరాడ శ్రీనివాస్‌, ఉచ్చుల స్టాలిన్‌, చెన్ను వి జయ్‌, పాలపర్తి కృపానాథ్‌, కుక్కల బాలచందర్‌, రేలంగి శ్రీను శనివారం సమన్లు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement