ఐసెట్‌ కౌన్సెలింగ్‌ కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఐసెట్‌ కౌన్సెలింగ్‌ కేంద్రం ప్రారంభం

Aug 23 2026 12:52 AM | Updated on Aug 23 2026 12:52 AM

ఐసెట్‌ కౌన్సెలింగ్‌ కేంద్రం ప్రారంభం

భీమవరం: స్థానిక సీఎస్‌ఎన్‌ కళాశాలలో ఏపీ ఐసెట్‌ ఉచిత కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని శనివారం సెక్రటరీ, కరస్పాండెంట్‌ చీడే సత్యనారాయణ ప్రారంభించారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఈనెల 24 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సకుమల్ల సత్యనారాయణ తెలిపారు. ఈ కేంద్రంలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని, ఉచితంగా కౌన్సెలింగ్‌ సేవలు పొందవచ్చన్నారు. ఈనెల 27 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలని, వచ్చేనెల 7న సీటు కేటాయింపు ఉంటుందన్నారు. కేవీ సత్యనారాయణ, పి.దుర్గాప్రసాద్‌, టి.లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement