పేదలపై పంచ్‌ధర | - | Sakshi
Sakshi News home page

పేదలపై పంచ్‌ధర

Aug 23 2026 12:52 AM | Updated on Aug 23 2026 12:52 AM

నష్టాలు భరించలేం వ్యాపారం దెబ్బతింటోంది

పంచదార ధరలు ఇలా..

(కిలో రూ.లలో)

ఉమ్మడి జిల్లాలో చక్కెర వినియోగం (సుమారుగా)

ద్వారకాతిరుమల: పండుగల వేళ ఇంట్లో తీపి చేసుకుందామంటే ధరలు చేదు అనుభూతిని మిగులుస్తున్నాయి. వంటింట్లో నిత్యావసరమైన పంచదార ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం పండుగలు, వ్రతాలు, శుభకార్యాల సీజన్‌ కావడంతో వీటి వినియోగం పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రిటైల్‌ మార్కెట్‌లో జులై నెలాఖరు నాటికి కిలో పంచదార ధర రూ.45 ఉండగా.. ప్రస్తుతం రూ.75కు చేరింది. ఈనెల ప్రారంభం నుంచి ధరలు మరింత పెరుగుతున్నాయి. 22 రోజుల్లోనే కిలోకు రూ.30 పెరగడం షాక్‌కు గురిచేస్తోంది. ఈనెల 1న కిలో రూ.45 ఉన్న ధర ప్రస్తుతం రూ.75గా చేరింది. ఒక కుటుంబం సగటున నెలకు 5 కిలోల పంచదార వినియోగిస్తే సుమారు రూ.150లు అదనపు భారం కానుంది. జిల్లాలో చక్కెర వినియోగంలో 35 శాతం వరకు మాత్రమే ఇళ్లల్లో వాడుతుండగా.. మిగిలిన 65 శాతం హో టళ్లు, బేకరీలు, స్వీట్‌ షాపులు, క్యాటరింగ్‌ వ్యాపారాలు, డ్రింక్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌ తయారీ యూనిట్లలో వినియోగిస్తున్నారు.

మరింత పెరిగే అవకాశం : ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు పండుగల సీజన్‌ కావడంతో పంచదారకు డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ధరలూ పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. దేశీయ మార్కెట్‌లో సరఫరా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అది సత్ఫలితాలనిస్తే ధరలు అదుపులోకి రావచ్చని అంటున్నారు.

అదేబాటలో బెల్లం

పంచదార ధరల పెరుగుదల బాటలో బెల్లం కూడా పయనిస్తోంది. ప్రస్తుతం రూ.70 నుంచి రూ.100 వరకు నాణ్యతను బట్టి బెల్లం ధరలు ఉన్నాయి. ఆర్గానిక్‌, ప్యూర్‌ చెరకు, ప్రముఖ బ్రాండ్ల బెల్లం ధరలు మరింత భగ్గుమంటున్నాయి. నాణ్యమైన ఆర్గానిక్‌ బెల్లం కిలో రూ.100కు పైగా ఉంది. పంచదార, బెల్లంతో పాటు బియ్యం, నూనెలు, ధని యాలు, పప్పులు, ఉల్లిపాయలు తదితర నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటం సా మాన్యుడిని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కూటమి ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

పండుగ సీజన్‌ ప్రారంభమైందని సంబరపడేలోపు పంచదార ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇతర ముడి సరుకుల ధరలు సైతం భారమయ్యాయి. స్వీట్ల తయారీ ఖర్చు బాగా పెరిగింది. అలాగని స్వీట్ల ధరలు పెంచితే కొనేనాథుడు ఉండడు. పాత ధరలకు అమ్ముదామంటే నష్టాలు భరించాల్సి వస్తోంది. వ్యాపారం ఎలా నడపాలో అర్థం కావడం లేదు.

– కొత్తపల్లి దొరబాబు, స్వీట్‌ షాపు నిర్వాహకుడు, ద్వారకాతిరుమల

గత మూడు వారాల్లో పెరిగిన చక్కెర ధర కారణంగా వ్యాపారం దెబ్బతింటోంది. శ్రావణమాసం, వినాయక చవితి, దీపావళి పండుగ సమయాల్లో స్వీట్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. అయితే ఈసారి మెటీరియల్‌ కాస్ట్‌ పెరిగిపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించడం లేదు. ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను అదుపుచేయాలి.

– గోపారామ్‌ దేవాసీ, స్వీట్‌ షాపు నిర్వాహకుడు, ద్వారకానగర్‌

తేదీ హోల్‌సేల్‌ రిటైల్‌

ఆగస్టు 1 45 50

ఆగస్టు 4 50 55

ఆగస్టు 10 56 60

ఆగస్టు 17 60 65

ఆగస్టు 19 63 68

ఆగస్టు 22 70 75

సంవత్సరం వార్షిక వ్యక్తి సగటు

వినియోగం వినియోగం

(టన్నులు) (కిలోలు)

2020–21 1.05 లక్షలు 23.5

2021–22 1.12 లక్షలు 24.8

2022–23 1.18 లక్షలు 25.9

2023–24 1.22 లక్షలు 26.5

2024–25 1.25 లక్షలు 27.0

చేదెక్కిన తీపి

చక్కెర ధరలు ౖపైపెకి..

22 రోజుల్లో కిలోకు రూ.30 పెరుగుదల

రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం

అదే బాటలో బెల్లం ధరలు

టీ షాపులు, స్వీట్స్‌, బేకరీలు, హోటళ్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం

ఏఐ సృష్టించిన చిత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement