పరిశుభ్రత అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రత అందరి బాధ్యత

Aug 23 2026 12:52 AM | Updated on Aug 23 2026 12:52 AM

పరిశుభ్రత అందరి బాధ్యత 26న జాబ్‌మేళా నేటి నుంచి విద్యుత్‌ ఏఈఈ పరీక్షలు

భీమవరం (ప్రకాశంచౌక్‌): పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక హౌసింగ్‌ బోర్డు ప్రాంతంలోని ఆదిత్య కళావేదిక పార్కులో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పచ్చదనం, స్వచ్ఛత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

‘సర్‌’ పరిశీలన

భీమవరం మున్సిపాలిటీ పరిధిలో సర్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తదితర ప్రక్రియలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తణుకు అర్బన్‌: తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఈనెల 26న ఉద్యోగ దిక్సూచి మేళా నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్‌ యు.లక్ష్మీసుందరీబాయ్‌ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి జరిగే మేళాలో 800లకుపైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. జియో, ఎల్‌అండ్‌టీ, అపోలో ఫార్మసీ, టాటా ఎలక్ట్రా నిక్స్‌, కియా ఇండియా, హెటెరో ల్యాబ్స్‌, ఆంధ్రా సుగర్స్‌ వంటి 15కు పైగా కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, పీజీ పూర్తయిన వారు రెజ్యూమ్‌తోపాటు సర్టిఫికెట్స్‌ జెరాక్స్‌ కాపీలు వెంట తీసుకురావాలని, ఫార్మల్‌ డ్రెస్‌లో రావాలని సూచించారు.

భీమవరం: విద్యుత్‌ ఏఈఈ నియామక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్టు ఎస్‌ఈ పి.ఉషారాణి తెలిపారు. ఆదివారం నుంచి 27 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు సెక్షన్లుగా పరీక్షలు జరుగుతాయన్నారు. భీమవరం డీఎన్నార్‌, సీతారాంపురంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌, తాడేపల్లిగూడెంలో శశి ఇంజనీరింగ్‌, పెదతాడేపల్లిలో వాసవీ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement