ఇది కూటమి ప్రభుత్వమా.. కూల్చే ప్రభుత్వమా? | - | Sakshi
Sakshi News home page

ఇది కూటమి ప్రభుత్వమా.. కూల్చే ప్రభుత్వమా?

Aug 23 2026 12:52 AM | Updated on Aug 23 2026 12:52 AM

వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ధ్వజం

ఇరగవరం: ఇది కూటమి ప్రభుత్వమా.. కూల్చే ప్రభుత్వమా అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అ ధ్యక్షురాలు, శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. శనివారం మండంలోని అయితంపూడిలో తాజా మాజీ సర్పంచ్‌ లావణ్య కుటుంబాన్ని మరో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లను టీడీపీ నేతలు రాజకీయ కక్షలతో కూల్చడం దారుణమన్నారు. తణుకు నియోజకవర్గంలో భయానక వాతావరణం ఉందనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తణుకు ఎమ్మెల్యేకు గుణపాఠం తప్పదన్నారు. సర్పంచ్‌పై ఇంత కక్ష అవసరమా? ఇంత దౌర్జన్యమా? మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ చేస్తున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అలాగే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌పై కూడా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలన దారుణంగా ఉందన్నారు. ఇళ్లు కో ల్పోయి న వైఎస్సార్‌సీపీ కుటుంబంతో పాటు మిగిలిన మూడు కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంద న్నారు. భీమవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కనుమూరి విజయదుర్గ, భీమవరం టౌన్‌ ప్రెసిడెంట్‌ వై.కృపామణి, జిల్లా మహిళా విభాగం కార్యదర్శి మొగ్గ మంగ, భీమవరం 25వ వార్డు సెక్రటరీ పట్టిం శశితల్లి, పార్టీ అంగన్‌వాడీల విభాగ రా ష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళ, ఎస్‌.ఎలిజిబెత్‌ రాణి, ఆశాజ్యోతి, బుద్ధరాజు దేవి, తణుకు మహిళ అధ్యక్షురాలు మెహర్‌ అన్సారీ, కాకర్ల విశాలాక్షి, మండల అధ్యక్షురాలు కిరణ్మయి, ఉండవల్లి జానకి, షేక్‌ పాహిమా, టౌన్‌ మహిళా ప్రెసిడెంట్‌ నూకాల కనకదుర్గ, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement