వరలక్ష్మీ నమోస్తుతే.. వరలక్ష్మీ పాహిమాం.. స్మరణలు మార్మోగాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవార్లు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. భీమవరంలో మావుళ్లమ్మవారిని నాలుగు లక్షల గాజులతో విశేషంగా అలంకరించారు. ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ పూజాదికాలు నిర్వహించారు. సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ బుద్ధ మహాలక్ష్మీ నగేష్, దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పర్యవేక్షించారు. అలాగే ఏలూరు పత్తేబాదలోని కనకదుర్గమ్మను అరిసెలతో అలంకరించారు.
– భీమవరం (ప్రకాశంచౌక్)/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)


