న్యూస్‌రీల్
ఆక్వాకు అండగా వైఎస్సార్‌సీపీ
అనుమానాస్పద మృతి
ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన కాళ్ల మండలంలో చోటుచేసుకుంది. 8లో u
ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్‌పై రెండేళ్లుగా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటన ప్రభావంతో దిగొచ్చింది. ఆఘమేఘాలపై ఎన్నికల హామీని అమలుచేస్తూ జీఓను విడుదల చేసింది. మరోపక్క రొయ్య ధరలు పెరుగుతుండటం ఆక్వా రైతులకు ఊరటనిస్తోంది. నెలరోజుల క్రితం కిలోకు వంద కౌంట్ రూ.220 ఉన్న ధర ప్రస్తుతం రూ.280కు చేరింది.
గురువారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి, భీమవరం: సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ దోపిడీతో ఆక్వా అధోగతి పాలవుతోంది. జోనన్‌తో నిమిత్తం లేకుండా ఆక్వా రైతులందరికీ రూ.1.50 రాయితీ విద్యుత్ ఇస్తానని, కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తానని, ఏరియేటర్స్‌పై సబ్సిడీ ఇస్తానంటూ ఉండి ఎన్నికల సభలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అటకెక్కించారు. మరోపక్క సిండికేట్ పెద్దలు దాదాపు టీడీపీకి చెందిన వారే కావడంతో కూటమి పాలనలో వారి ఇష్టారాజ్యంగా మారింది. అదునుచూసి ఏకపక్షంగా మేత ధరలు పెంచుతూ, రొయ్య రేట్లు తగ్గిస్తూ రైతుల కష్టాన్ని కాజేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రాయితీ విద్యుత్ అందించాలని, సిండికేట్ దోపిడీని అరికట్టాలంటూ ఏడాదిన్నర కాలంగా రైతులు రోడ్డెక్కి వరుస ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చింది.
ఆఘమేఘాలపై..
రెండేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రాయితీ విద్యుత్ జీఓ విడుదల చేయడం జగన్ పర్యటన పుణ్యమేనని ఆక్వా రైతులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 54,033 రాయితీ కనెక్షన్లు ఉండగా తాజాగా మరో 12,500 కనెక్షన్లకు రాయితీ ఇస్తూ జీఓ విడుదల చేసింది. ఇప్పటికే జిల్లాలో 13,648 రాయితీ కనెక్షన్లకు గాను కొత్తగా 3,459 కనెక్షన్లకు రాయితీ వర్తించనుంది. మరోపక్క నెల రోజుల క్రితం వరకు పతనమవుతూ వచ్చిన రొయ్య ధరలు తర్వాత పుంజుకోవడం రైతులకు ఊరటనిస్తోంది. గత నెల మొదటి రెండు వారాల్లో వంద కౌంట్ ధరను ఆక్వా సిండికేట్ రూ.220 వరకు తగ్గించేసింది.
మిగిలిన 80, 70, 60, తదితర కౌంట్ల ధరలు కిలోకు రూ.30 నుంచి రూ. 50 వరకు కోత పెట్టారు. జగన్ వచ్చి వెళ్లాకా.. ధరలు పెరుగుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వంద కౌంట్ ధర రూ.280లు వరకు ఉండగా మిగిలిన కౌంట్లు ఆ మేరకు పెరిగాయంటున్నారు. ధరలను నిలకడగా ఉంచాలని, గిట్టుబాటు ధర లేని సమయంలో రొయ్యలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీల నిర్మించాలని, ఏరియేటర్లుపై సబ్సిడీ హామీలను కూటమి ప్రభుత్వం అమలుచేయాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.
ఆక్వా రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు సర్కారుపై సమరభేరీ మోగించారు. గత నెల 15న భీమవరం వచ్చారు. ఆయన పర్యటన ఆద్యంతం జనసునామీని తలపించింది. సిండికేట్ దోపిడీతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులకు జగన్ రాక కొండంత ధైర్యాన్నిచ్చింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులతో భీమవరం పోటెత్తింది. జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రైతులు సమస్యల సుడిగుండంలో కూరుకుపోయారన్నారు. ఆక్వా రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. జోన్‌తో సంబంధం లేకుండా ఎంతమంది రైతులకు రాయితీ విద్యుత్ ఇచ్చారని జగన్ ప్రశ్నించగా ఎవరికి ఇవ్వలేదని రైతులు చెప్పారు. కోల్డ్ స్టోరేజీలు కట్టించారా? ఏరియేటర్స్‌పై సబ్సిడీ ఇస్తురా ? అని ప్రశ్నించగా.. ఏమీ కట్టించలేదని, సబ్సిడీ ఇవ్వలేదని వేలాదిమంది రైతులు చేతులు అడ్డంగా ఊపుతూ బదులిచ్చారు. రాబోయే మన ప్రభుత్వంలో సిండికేట్‌ను నామరూపల్లేకుండా చే స్తానంటూ జగన్ హెచ్చరించిన సమయంలో సభా ప్రాంగణం మొత్తం రైతుల హర్షధ్వానాలతో మార్మోగింది.
ఆక్వాకు అండగా జగన్ భీమవరం పర్యటన ప్రభావం
రాయితీ విద్యుత్ హామీని అమల్లోకి తెచ్చిన కూటమి సర్కారు
పెరుగుతోన్న రొయ్యల ధరలు
కిలో రూ.60 వరకు పెరిగిన వైనం
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు


