జూడాల సమ్మైపె చర్చించాలి | - | Sakshi
Sakshi News home page

జూడాల సమ్మైపె చర్చించాలి

Aug 20 2026 7:38 AM | Updated on Aug 20 2026 7:38 AM

జూడాల సమ్మైపె చర్చించాలి ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్ల పరిశీలన సాంకేతిక పరిజ్ఞానం కీలకం మూలవిరాట్‌ల ఫొటోలు తీయడంపై నిషేధం 12న జాతీయ లోక్‌అదాలత్‌

తణుకు అర్బన్‌: ప్రభుత్వ జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న సమ్మైపె శాసనమండలిలో చర్చ జరగాలని శాసనమండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్‌ అన్నారు. బుధవారం శాసనమండలిలో పలు ప్రజా సమస్యలను ఆయన మండలి దృష్టికి తీసుకువచ్చారు. ముందుగా మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికై న తూమాటి మాధవరావును అభినందిస్తూ మండలిలో ప్రజాసమస్యలపై అధిక సమయం చర్చలు జరిగేలా చూడాలని సూచించారు. వచ్చే నెలలో పదవీ కాలం ముగియనున్న ఎంపీటీసీలకు ఈ ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేయకపోవడం చాలా విచారకరమని, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఎంపీటీసీలకు అందాల్సిన గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లా–ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాను ప్రత్యేక ఉత్పత్తి జిల్లాగా ఎంపిక చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రతినిధుల బృందం సభ్యులు ఇష్‌దీప్‌ చంద్‌, స్మిత్‌ బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ నాగరాణితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జిల్లాలోని రొయ్యల సా గు, ఆక్వాకల్చర్‌, ప్రాసెసింగ్‌ యూనిట్ల పని తీరు, ఉత్పత్తి సామర్థ్యం, మౌలిక వసతులు, ఉపాధి కల్పన, ఎగుమతులు, మార్కెటింగ్‌ అవకాశాలపై ఈ బృందం పరిశీలన జరుపుతోంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బృంద సభ్యులు చెప్పారు. జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్‌, హ్యాండ్లూమ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం: విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ మధుమూర్తి పిలుపునిచ్చారు. ఏపీ నిట్‌లో బుధవారం 2026–27 బ్యాచ్‌ విద్యార్థులకు ఇండక్షన్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ విద్యార్థి జీవితంలో మొదటి సంవత్సరం కీలకమని, పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలన్నారు. క మ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ప్రాయోగిక సామర్థాలు, క్రమశిక్షణ, నైతిక విలువలు, జట్టు భా వన వంటివి ముఖ్యమన్నారు. నిట్‌ డైరెక్టర్‌ ఎన్‌వీ రమణరావు వర్చువల్‌గా మాట్లాడుతూ అధ్యాపకుల బలం, వారి అనుభవాలను విద్యార్థులు పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. డీన్‌ అకడమిక్‌ ఎన్‌.జయరామ్‌, రిజిస్ట్రార్‌ దినేష్‌ శంకరరెడ్డి, రవికిరణ్‌శాస్త్రి, అసోసియేట్‌ డీన్లు పాల్గొన్నారు.

యలమంచిలి: జిల్లాలో దేవదాయశాఖ ఆధీనంలోని దేవస్థానాల్లో దేవతామూర్తులను సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని పూర్తిగా నిషేధించాలని ఎండోమెంట్‌ కమిషనర్‌ వి.హరిసూర్యప్రకాష్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానాల్లో మూలవిరాట్‌ల ఫొటోలు, వీడియోలు తీయడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమన్నారు. ఆలయ ఈఓలు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రముఖ ఆలయాల్లో ఈ నియమం పాటిస్తున్నా.. కొన్ని ఆలయాల్లో ఉత్సవాల సమయాల్లో మూలవిరాట్‌ల ఫొటోలు తీస్తున్నారని, మీడియా సైతం వీటిని ప్రసారం చేస్తుందన్నారు. దీని వలన ఆలయ సంబంధమైన ప్రధాన దేవతా విగ్రహాల కళలు తగ్గుతున్నాయని వేద పండితులు భావిస్తున్నారన్నా రు. కొన్ని ఆలయాల్లో ప్రధాన క్రతువులు, ప్ర త్యేక పూజల సమయంలో అధికారులే వీడియోలు, ఫొటోలు తీసి మీడియాకు ఇచ్చే అలవాటు కొనసాగుతుందని, ఇకపై దీనిపైనా ని షేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవ విగ్రహాలను మాత్రమే మీడియాకు, ప్రచారానికి వినియోగించాలని ఆయన ఆదేశించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ లోక్‌ అదాలత్‌ల ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారానికి పోలీస్‌ అధికారులు కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి కోరారు. స్థానిక జిల్లా కోర్టులో ఉమ్మడి జిల్లాలోని పోలీసు అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. వచ్చేనెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామని, రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్‌ కేసులను రాజీ చేస్తామన్నారు. కక్షిదారులు సంబంధిత పోలీసు అధికారులను లేదా న్యాయస్థానాలను సంప్రదించవచ్చన్నారు. కేసుల పరిష్కారంలో సలహాల కోసం 15100 ద్వారా సంప్రదించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement