దెందులూరు: పెదపాడు మండలం వట్లూరు సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీ వద్ద బుధవారం ఒక ఆర్టీసీ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. విజయవాడ నుంచి అమలాపురం వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు మార్జిన్‌లో నిలిపివేశాడు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించి, సురక్షితంగా పంపించివేశాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక కంటైనర్ లారీ, రోడ్డు పక్కన ఆపి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి, ఆగకుండా వెళ్లిపోయింది. అప్పటికే ప్రయాణికులు మరో బస్సులోకి మారడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై హైవే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఛేజ్ చేసి కంటైనర్‌ను పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


