అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కేంద్రంగా ‘భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (భీమా ఉడా) ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా నరసాపురం పార్లమెంట్‌ను నూతన పశ్చిమగోదావరి జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా అడ్మినిస్రేషన్ సంబంధించి దాదాపు 90 శాతం విభాగాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం భీమవరం అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేసే చర్యలు తీసుకునే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. దీంతో ఏలూరు అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీలోనే పశ్చిమగోదావరి జిల్లా కూడా ఉండిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు భీమా ఉడాను ఏర్పాటు చేశారు.
తీరిన ప్రయాణ భారం : గతంలో జిల్లా ప్రజలు భూముల అనుమతులు, టౌన్ ప్లానింగ్ పనుల కోసం 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరుకు ప్రయాణించాల్సి వచ్చేది. కొత్త జిల్లా ఏర్పాటుతో పాటు ఇప్పుడు ‘భీమా ఉడా’ స్థానికంగా అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణ భారం తగ్గి, పనులు సులభంగా, వేగవంతంగా పూర్తవుతాయి.
నిర్వహణ, పని విధానం
ÁÐ]l* Eyé {糫§é¯]l M>Æ>Å-ÌSĶæ*°² ÁÐ]l$-Ð]l-Æý‡…ÌZ HÆ>µr$ ^ólĶæ$-¯]l$-¯é²Æý‡$. A£é-Çsîæ ´ëϰ…VŠæ BïœசÆŠ‡™ø ´ër$ AÐ]l-çÜ-Æý‡OÐðl$¯]l íܺ¾…-¨° CMýSPyýl °Ä¶æ$-Ñ$Ýë¢Æý‡$. BÆý‡$ Ð]l¬°-íÜ-´ë-Í-sîæÌZϰ Ýë«§é-Æý‡×æ ¿ýæÐ]l¯]l A¯]l$-Ð]l$-™èl$Ë$, ÌôæA-Ð]l#r$Ï Ý린MýS so¯Œl ´ëϰ…VŠæ Ñ¿êVýS… ^èl*çÜ$-MýS$…-r$…-¨. Ð]l*çÜtÆŠæ ´ëϯŒl §ésìæ fÇVóS ò³§ýlª ™èlÆý‡à °Æ>Ã-×êÌS A¯]l$-Ð]l$™èl$Ë$ ÁÐ]l* Eyé §éÓÆ>¯ól gêÈ AÐ]l#™éƇ$$. hÌêÏÌZ° {V>Ò$׿ {´ë…™é-ÌS-°²…-sìæMîS çÜ…º…-«¨…-_¯]l ÌôæA-Ð]l#r$Ï, ¿ýæÐ]l-¯éË$, çܦÌêÌS AÀ-Ð]l–¨® A¯]l$-Ð]l$™èl$Ë$ ç³NÇ¢Ýë¦-Ƈ$$ÌZ ÁÐ]l* Eyé ç³Ç-«¨-ÌZ¯ól fÆý‡$VýS$™éƇ$$.
భీమవరం వ్యూ
ఇప్పటివరకు అథారిటీ కార్యాలయం దూరంగా ఉండటంతో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనధికార లేఅవుట్లు వేసి, నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు విక్రయించేవారు. ఇప్పుడు స్థానికంగానే భీమా ఉడా అందుబాటులోకి రావడంతో ప్రజలు సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం ఏర్పడింది. ఇది అక్రమ లేఅవుట్లకు, నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెడుతుందని భావిస్తున్నారు.
అథారిటీ పరిధిలో
ఆరు మున్సిపాలిటీలు, 19 మండలాలు
భీమవరంలో ప్రధాన కార్యాలయం ఏర్పాటుతో కార్యకలాపాలు
ఇకపై సొంత జిల్లాలో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు


