చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జంగారెడ్డిగూడెం పట్టణం అశ్వరావుపేట రోడ్డులోని కే–కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. ఈనెల 13న రాత్రి9:30 గంటల సమయంలో ప్రమాదానికి గురైన సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 17న మృతి చెందారని ఎస్సై పేర్కొన్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు వెంటనే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.


