పెళ్లింట విషాదం
8లో
ఊహల్లో ఆశావహులు
న్యూస్‌రీల్
రాజకీయ బేరీజులు
మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026
స్థానిక సమరానికి సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన మున్సిపల్, పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు కసరత్తు మొదలైంది. పురపాలక సంస్థల్లో ఓటర్ల జాబితాల రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సెప్టెంబరు 3న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించాలని ఈసీ ఆదేశించడం ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది.
సాక్షి, భీమవరం: జిల్లాలో ఐదు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనకు వ్యతిరేకంగా గతంలో కొన్ని గ్రామాలు కోర్టులను ఆశ్రయించాయి. గత ఐదేళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో ఈ పురపాలక సంఘాలు ప్రత్యేక పాలనలోనే ఉన్నాయి. 2021 మార్చిలో ఎన్నికై న నరసాపురం మున్సిపాల్టీ పాలకవర్గ పదవీకాలం ఇటీవల మార్చిలో ముగిసింది. తర్వాత ఎన్నిక జరిగిన ఆకివీడు నగర పంచాయతీ పాలకవర్గం పదవీకాలం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. మరోపక్క జిల్లాలో 409 పంచాయతీలకు దాదాపు 2021లో ఎన్నికలు జరిగిన దాదాపు 390 పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగిసింది. 2021 సెప్టెంబరులో బాధ్యతలు చేపట్టిన 20 మంది జెడ్పీటీసీ, 332 మంది ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం సెప్టెంబరు 24తో ముగుస్తుంది. ఈ తరుణంలో స్థానిక ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సన్నాహాలు షురూ
భీమవరం మున్సిపాల్టీలో 39 వార్డులు ఉండగా, తణుకులో 34, తాడేపల్లిగూడెంలో 32, పాలకొల్లులో 31, నరసాపురంలో 31 వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కలు ప్రకారం వార్డుల విభజనకు రెండు నెలల క్రితం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌తో వార్డుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావించినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఉన్న వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి సెప్టెంబరు 3న అధికారికంగా ప్రకటించాలని తాజాగా ఈసీ ఆదేశించింది. ఈ మేరకు 2026 జనవరి ఒకటికి ఓటు హక్కు ఉన్న వారి వివరాలతో అధికారులు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు కీలకమైన చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు ఖరారుపైన కసరత్తు జరుగుతోంది.
పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు..
జిల్లాలోని పంచాయతీల్లో ఏప్రిల్‌లోనే వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను వెల్లడించగా ఇటీవల పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు ఆదేశించారు. ఈనెల 20లోపు పంచాయతీల వారీగా పోలింగ్ స్టేషన్ల ప్రాథమిక జాబితా సిద్ధం చేసి 23న ప్రచురించాలి. 26 వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాలను 31న ప్రచురిస్తారు. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఓటర్లు ఎంతమంది ఉన్నారనే వివరాలను సిద్ధం చేస్తున్నారు.
పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
రానున్న రెండు, మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు మొదలై కొత్త పాలకవర్గాలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు, విజయావకాశాలపై ఆశావహులు ఎవరి అంచనాల్లో వాళ్లు తలమునకలై ఉన్నారు. ఈసారి తమకు అవకాశం దక్కుతుందన్న ఆశతో ఇప్పటికే పలువురు స్థానిక, సామాజికవర్గ పెద్దలను కలిసి మంతనాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చుపైన లెక్కలు వేస్తున్నారు. గతంలో కౌన్సిలర్లుగా, సర్పంచులుగా పనిచేసిన వారు మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువత అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. లోకల్‌గా జరిగే శుభకార్యాలు, కార్యక్రమాలకు హాజరవుతూ ఆశావహులు ప్రజల్లో తిరిగేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై కసరత్తు
సెప్టెంబరు 3న వార్డుల జాబితాల ప్రకటన
ఆశావహుల్లో ఉత్సాహం
రిజర్వేషన్లపై లెక్కలు
జిల్లాలో ఐదు మున్సిపాల్టీలు, 409 పంచాయతీలు
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి వాటి ఊసెత్తడం లేదు. సూపర్‌సిక్స్‌లోని మిగిలిన హామీల అమలు అంతంతమాత్రమే. కొత్త పింఛన్ ఒక్కటీ ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ, వలంటీర్, సచివాలయ వ్యవస్థల నిర్వీర్యం, రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. స్థానిక సంస్థలకు నిధుల కొరతతో అభివృద్ధి పడకేసింది. చంద్రబాబు సర్కారు వంచనపై మహిళలు, రైతులు, యువత, ఉద్యోగులు, కార్మికులు తదితర అన్నివర్గాల్లోని తీవ్ర వ్యతిరేకత రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు లాభిస్తుందని వైఎస్సార్‌సీపీ పూర్తి విశ్వాసంతో ఉంది. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమలుచేసిన నవరత్నాలు, సచివాలయ వ్యవస్థ, ఇంటింటికీ సంక్షేమ పథకాలు, ఊరూరా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు పాలనలో అన్నింటా పెరిగిన ధరలు, ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ పోరాటాలకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన స్థానిక పోరులో ఘన విజయం అందిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


