భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి తీసుకున్న అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, గడువులోపు పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో భాగంగా డీఆర్వో పి.ప్రభాకర్, పీజీఆర్‌ఎస్ జిల్లా ప్రత్యేక అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, కలెక్టరేట్ ఏఓ ఎన్.వెంకటేశ్వరరావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌లో 163, రెవెన్యూ క్లినిక్‌లో 50 మొత్తంగా 213 అర్జీలు స్వీకరించామన్నారు. జిల్లా అధికారులు వృద్ధుల సంక్షేమం ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
వృద్ధుల సమస్యల పరిష్కరించాలి
భీమవరం: వృద్ధుల సమస్యలను పరిష్కరించాలని సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం భీమవరంలో జేసీ కేఆర్ కల్పశ్రీకి వినతిపత్రం అందజేశారు. వృద్ధుల కోర్కెల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొటికలపూడి చిట్టి వెంకయ్య, ఉపాధ్యక్షుడు కరుణాకర్ చౌదరి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించా రు. అనంతరం వారు మాల్లాడుతూ తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అప్పిలేట్ ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గా ప్రసాద్, ఫోరం నిర్వహణ కార్యదర్శి తాళ్లపూడి గాంధీ, ప్రధాన కార్యదర్శి బోనం పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు.
జేసీ కల్పశ్రీ


