ఆకివీడు: స్థానిక పెదపేటలో ఉంటున్న 17 ఇళ్లకు మార్కింగ్ వేసి భయభ్రాంతులకు గురిచేయడం దారుణమని ఆలిండియా లాయర్స్ యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ప్రాంతాన్ని ఆదివారం ప్రతినిధి బృందం పరిశీలించింది. అధికారులు చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో నిర్మించుకున్న ఇళ్లను ఖాళీ చేయించాలంటే నోటీసులు ఇవ్వాలని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లతామన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దిగుపాటి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు కామన మునిస్వామి, జిల్లా కమిటీ సభ్యులు రామగాని కాస్ట్రో, సునీల్ కుమార్, వేగేశ్న సుబ్బరాజు పాల్గొన్నారు.


