ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నేటి యువత కూడా దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలని ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్ల స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. జిల్లాలో నియోజకవర్గ స్థాయి ఎంపికలు గత నెల 27 నుంచి 31 వరకు 7 నియోజకవర్గాలలో నిర్వహించామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌ఏ అజీజ్ తెలిపారు. మొత్తం 1,200 మంది క్రీడాకారులను 12 క్రీడాంశాల్లో జిల్లా స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేశామన్నారు. పోటీల తొలిరోజు ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, వెయిట్ లిఫ్టింగ్, అండర్–17 విభాగంలో వాలీ బాల్, కబడ్డీ, ఖో–ఖో అంశాల్లో జిల్లా స్థాయి ఎంపికలు, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ కె.జగదీశ్వరి, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎం.పార్థసారధి, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ బడేటి వెంకట రామయ్య, అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అదిరెడ్డి సత్యనారాయణ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలు మంగ, సెట్‌వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు


