రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Aug 7 2026 12:56 AM | Updated on Aug 7 2026 12:56 AM

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ఉంగుటూరు: అమరావతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌–17 కబడ్డీ పోటీల్లో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలవగా, ఆ జట్టుకు నియోజకవర్గం నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఉంగుటూరుకు చెందిన ఎం.దీక్షిత, పెదనిండ్రకొలను హైస్కూల్‌ విద్యార్థిని ఎం.ప్రియదర్శిని, కై కరం హైస్కూల్‌ విద్యార్థిని ఎస్‌. కనకదుర్గ ఎంపికై న వారిలో ఉన్నారు. అలాగే రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ జట్టుకు నియోజకవర్గానికి చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. పెదనిండ్రకొలను జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి సీహెచ్‌ బాబులు, కాగుపాడు జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి వై.సాయితేజ, గొల్లగూడెం సూర్య స్కూల్‌ విద్యార్థి టి.సాత్విక్‌, నారాయణపురం జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి ఎ.రోహిత్‌ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

కారుమూరి పీఏ సురజిత్‌పై కేసు నమోదు

తణుకు అర్బన్‌: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్సనల్‌ అసిస్టెంట్‌ సురజిత్‌పై తణుకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేశారంటూ తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన తణుకు ఏఎంసీ చైర్మన్‌ కొండేటి శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు.

అక్రమ కేసు

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్సనల్‌ అసిస్టెంట్‌ సురజిత్‌పై అక్రమ కేసు నమోదుచేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి అన్నారు. తణుకు కూటమి నాయకులు కారుమూరి కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని, తాజాగా పీఏ సురజిత్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారని కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కూటమి నాయకుల ఒత్తిడి మేరకు నమోదుచేసిన అక్రమ కేసుపై లీగల్‌గానే పోరాడతామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement