శాకంబరి అలంకరణలో మావుళ్లమ్మ
శాకంబర అలంకరణలో ఉమాసోమేశ్వరస్వామి
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ వారికి గురుపౌర్ణమి సందర్భంగా 6 టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో శాకంబరి అలంకారం చేసి.. చండీహోమం నిర్వహించారు. 90 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు. గాయత్రి డాన్స్ అకాడమీ మాస్టర్ పెద్దిశెట్టి గాయత్రి దేవి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మీ నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు రామాయణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పంచారామక్షేత్రం ఉమాసోమేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి కూరగాయలతో అలంకరణ నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


