తణుకు స్టార్‌ హాస్పిటల్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

తణుకు స్టార్‌ హాస్పిటల్‌ సీజ్‌

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

తణుకు స్టార్‌ హాస్పిటల్‌ సీజ్‌ వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు 17న క్యాంపస్‌ డ్రైవ్‌ గంజాయి కేసులో నిందితుడి అరెస్టు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం

తణుకు అర్బన్‌: తణుకు పరిధిలోని పైడిపర్రులో అక్రమంగా నిర్వహిస్తున్న స్టార్‌ ఆస్పత్రిని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సీజ్‌ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండానే సిజేరియన్లు చేస్తుండటంతోపాటు ఇటీవల బా లింత మృతి ఘటనతో డీఎంహెచ్‌ఓ జి.గీతా బాయ్‌ ఆధ్వర్యంలో రూరల్‌ పోలీసుల సమక్షంలో గురువారం ఆస్పత్రిని సీజ్‌ చేశారు. గత నెల 16న ఓ గర్భిణీకి గర్భధారణ సమయం పూర్తికాకపోయినా రహస్యంగా సిజేరియన్‌ చేసి ఆమె మృతికి కారకుడైన ఆస్పత్రి వైద్యుడు సుంకవల్లి పాండురంగారావుకు ఇటీవల నోటీసు లు అందజేసినా సరైన వివరణ ఇవ్వకపోవడంతోనే చర్యలు తీసుకున్నట్టు డీఎంహెచ్‌ఓ గీతాబాయ్‌ తెలిపారు. పోలీస్‌ విచారణ కొనసాగుతుందని ఆమె చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీదేవి పాల్గొన్నారు.

భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని పార్టీ అనుబంధ విభాగాల్లో నియ మిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల విజయరామ్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. జిల్లా అగ్నికుల క్షత్రియ విభాగం అ ధ్యక్షుడిగా తిరుమాని బాలచంద్రం, స్టూడెంట్‌ వింగ్‌ ఉపాధ్యక్షుడిగా షేక్‌ షఫీక్‌, వైఎస్సార్‌టీయూసీ ఉపాధ్యక్షుడిగా గంటా విజయ్‌కుమార్‌ రాజు, జనరల్‌ సెక్రటరీగా మల్లుల సత్యనారాయణ, సెక్రటరీలుగా తనుకుల వెంకటేశ్వరరా వు, మైలా అర్జునరావు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ గా దేవగుప్త జగదీష్‌ నియమితులయ్యారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): స్థానిక ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈనెల 17న క్యాంప్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. ఐటీఐ పూర్తిచేసినవారు అర్హులన్నారు. డ్రైవ్‌ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. వివరాలకు సెల్‌ 96406 30969, 9492885556, 9618382542 నంబర్లలో సంప్రదించాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్‌, ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

తణుకు అర్బన్‌: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని తణుకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులు అరెస్టు చేశారు. గతేడాది అక్టోబర్‌లో తణుకు ఉండ్రాజవరం రోడ్డులో శ్శశాన వాటిక ప్రాంతంలో ఐదు కిలోల గంజా యి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడు తణుకు మండలం మండపాకకి చెందిన పోలవరపు కుమార శివను బుధవారం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఒడిసాలోని మల్కాన్‌గిరి నుంచి గంజాయిని తీసుకువచ్చి తణుకు ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. ఇటీవల ద్విచక్ర వాహనాల చోరీలకు అలవాటుపడి కృష్ణలంక, రాజమండ్రి, ఉంగుటూరు, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేశాడని చెప్పారు. గంజాయి విక్రయాలపై సమాచారం తెలిస్తే 9490874538 తమకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఎకై ్సజ్‌ శాఖ ఎస్సైలు బి.లక్ష్మి, ఆర్‌.మధుబాబు పాల్గొన్నారు.

భీమవరం: జిల్లాలో ఎక్కడ మత్తుపదార్థాల ఎగుమతి, వినియోగం జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మితో కలిసి సమావేశం నిర్వహించారు. డ్రగ్స్‌ వద్దు బ్రో అనేది స్లోగన్‌ కాదని జీవితాన్ని కాపాడుకునే మార్గదర్శక సూత్రం అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పటిష్ట నిఘా పెట్టామన్నారు.

యోగాంధ్ర రిజిస్ట్రేషన్లపై..

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో యోగాంధ్ర– 2026 కార్యక్రమానికి విస్తృతస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 4.5 లక్షల మంది పౌరులతో యోగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement