రెండేళ్లు.. అతీగతీ లేని హామీలు | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లు.. అతీగతీ లేని హామీలు

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

రెండేళ్లు.. అతీగతీ లేని హామీలు

సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఆడబిడ్డ నిధి అడ్రస్‌ లేదు.. అర్హులందరికీ తల్లికి వందనం అందలేదు.. జిల్లా దశదిశ మార్చే అభివృద్ధి పథకాల హామీల అమలు అతీగతీ లేదు.. మామిడి నుంచి వరి వరకూ అన్నదాతలకు నిత్య సంక్షోభమే.. లెక్కకు మించి హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత అన్నింటినీ విస్మరించిన కూటమి ప్రభుత్వ పాలనకు రెండేళ్లు నిండాయి. అక్రమ కేసులు, వేధింపుల పర్వం, ప్రతిఘటిస్తే వ్యక్తిగత ఆస్తుల ధ్వంసరచన.. ఇంతకుమించి జిల్లాలో జరిగిందేమీ లేదు. పచ్చనేతల దందా.. ఊరూరా బెల్టుషాపులతో యథేచ్ఛగా మద్యం విక్రయాలకు తెరదీశారు. చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా..

కూటమి మోసపూరిత హామీలతో జిల్లా ప్రజలు నష్టపోయిన వైనాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసనలు, సదస్సులు, రౌండ్‌టేబుల్‌ సమావేశాల ద్వారా ప్రజలకు వివరించారు. దీనిలో భాగంగా ఏలూరు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో పార్టీ సమస్వయకర్తల నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ రెండేళ్లలో ఉమ్మడి జిల్లాలో కనీసం రూ.100 కోట్ల అభివృద్ధి పనులు కూడా జరగకపోవడం గమనార్హం.

ఆడబిడ్డ నిధి అందలేదు

నిరుద్యోగ భృతి ఊసు లేదు

జాడలేని అభివృద్ధి

కూటమి ప్రభుత్వరెండేళ్ల పాలనలో దౌర్జన్యకాండ

నేడు వైఎస్సార్‌సీపీ భారీ నిరసనలు

Advertisement
 
Advertisement
Advertisement