ఇదెంతకాలం? | - | Sakshi
Sakshi News home page

ఇదెంతకాలం?

Jan 3 2026 8:07 AM | Updated on Jan 3 2026 8:07 AM

ఇదెంత

ఇదెంతకాలం?

జాడ లేని డూడూ బసవన్నలు 33,363

ఉండి సమస్యలు తీరేనా?

గత ప్రభుత్వంలో పక్కాగా..

న్యూస్‌రీల్‌

పంచదార లేదు.. కందిపప్పు రాదు

జాడ లేని డూడూ బసవన్నలు
సంక్రాంతి అంటే డూడూ బసవన్నల సందడి కనిపించేది. అయితే ఆదరణ కరువై, పొట్టకూటి కోసం గంగిరెద్దులను ఆడించే వారు వేరే పనులు చూసుకుంటున్నారు. IIలో u
గోరంత పనికి కొండంత హడావుడి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం దిట్ట. జనవరి నుంచి రేషన్‌ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్టు కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వచ్చింది. అమల్లోకి వచ్చేసరికి జిల్లా కేంద్రంలోని కార్డుదారులకు మాత్రమే పరిమితం చేసి మిగిలిన వారిని ఉసూరుమనిపించింది. ఇప్పటికే కందిపప్పు సరఫరా మూణ్ణాళ్ల ముచ్చటవ్వగా, పంచదారకు కోత పెడుతోంది. గోధుమ పిండి పంపిణీ ఎంత కాలమన్న అనుమానాలు ఉన్నాయి.

శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026

సాక్షి, భీమవరం: సంక్రాంతి పండుగ కోసం అంటూ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు గోధుమ పిండి సరఫరా చేస్తుందని సామాజిక మాధ్యమాల్లో హోరె త్తించారు. అధికారులు సమీక్షలు కూడా నిర్వహించారు. మార్కెట్‌లో గోధుమ పిండి కిలో రూ.65ల వరకు ఉండగా రూ.20కు లభిస్తుందని లబ్ధిదారులు ఆశించారు. అయితే పంపిణీ చేసే సమయానికి పైలెట్‌ ప్రాజెక్టు పేరిట నగరాలు, ముఖ్య పట్టణాలకు మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసింది. జిల్లాలోని 1,052 రేషన్‌ డిపోల పరిధిలో 5,67,700 రేషన్‌ కార్డులు ఉండగా, కేవలం భీమవరంలోని 49 దుకాణాల పరిధిలో 33,363 కార్డులకు మాత్రమే గోధుమ పిండి ఇస్తున్నారు. నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలతో పాటు 20 మండలాల్లోని కార్డుదారులకు పంపిణీ చేయడం లేదు. దీంతో పండుగ భీమవరం వాసులకేనా అని మిగిలిన లబ్ధిదారులు మండిపడుతున్నారు. గోధుమ పిండి ప్రయోగాత్మకంగా పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కార్డుదారులు అందరికీ అందించాలని కోరుతున్నారు.

షాపుల వద్ద పడిగాపులు : కూటమి ప్రభుత్వంలో భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉన్న ఎండీయూ వాహనాలను నిలిపివేసి పాత రోజుల్లో మాదిరి సరుకుల కోసం రేషన్‌ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తెచ్చింది. దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటికే బియ్యం అందజేస్తున్నట్టు ప్రకటించినా క్షేత్రస్థాయిలో సరిగా అమలుకావడం లేదు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో సరిపడా నిల్వలు ఉండక బఫర్‌ గోడౌన్ల నుంచి పంపుతున్న పరిస్థితి. గతంలో ఒక దుకాణానికి ఒకే సారి సరుకులు చేరవేస్తే ఇప్పుడు రెండు మూడు ట్రి ప్పులుగా అందిస్తున్నారు. ఒక్కోసారి బియ్యం, పంచదార పూర్తిస్థాయిలో రాక సరుకుల పంపిణీ ఇబ్బంది అవుతోంది. వచ్చిన మేరకు బియ్యం అందజేస్తుండగా పంచదార కోసం మరలా షాపులకు వెళ్లాల్సి వస్తుంది.

చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రజాప్రతినిధులు చేసిన వాగ్దానాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. IIలో u

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 356 ఎండీయూ వాహనాల ద్వారా వినియోగదారుల చెంతకే సరుకులు అందజేసేవారు. తూకంలో కచ్చితత్వం, ఈ–పోస్‌ యంత్రాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ అమర్చి సరుకుల అక్రమ రవాణాకు తెరదించారు. అలాట్‌మెంట్‌ మేరకు రేషన్‌ షాపులు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, పాఠశాలలకు సరుకులు సరఫరా చేసేవారు. జిల్లాలోని ఉండి, తణు కు, తాడేపల్లిగూడెం, పెనుమంట్ర, పాలకొల్లు, నరసాపురంలోని మండల లెవిల్‌ స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్లలో రెండు నెలలకు సరిపడా సరుకులు సిద్ధంగా ఉండేవి.

2024 అక్టోబరులో కందిపప్పు పంపిణీ ప్రా రంభించిన చంద్రబాబు ప్రభుత్వం నాలుగు నెలలు తిరక్కుండానే చేతులెత్తేసింది. 2025 ఫిబ్రవరిలో అంతంతమాత్రంగా సరఫరా చేసి మార్చి నుంచి మొత్తం నిలిపివేసింది. కందిపప్పు కోసం డీడీలు తీయవద్దంటూ సివిల్‌ సప్లయీస్‌ అధికారులు ముందుగానే డీలర్లకు సమాచారం ఇస్తున్నారు. పంచదారకు కోత పెడుతున్నట్టు వినియోగదారులు చెబుతున్నారు. జిల్లాలోని మొత్తం కార్డుదారులకు దాదాపు 294 టన్నుల పంచదార అవసరమవుతుంది. సకాలంలో పూర్తిస్థాయిలో స్టాకు రాక సమస్య ఎదురవుతోంది. నవంబరు, డిసెంబరు నెలల్లో కొంతమంది కా ర్డుదారులకు చక్కెర అందలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజాపంపిణీ వ్యవస్థ అధోగతి పాలవుతోందని, పూర్తిస్థాయిలో సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు అంటున్నారు.

గోధుమ పిండి కొందరికే..

జిల్లా కేంద్రానికే పరిమితం

6 శాతంలోపు కార్డుదారులకే పంపిణీ

ఇప్పటికే సక్రమంగా జరగని సరుకుల సరఫరా

మూణ్ణాళ్ల ముచ్చటైన కందిపప్పు

పంచదారకు కోత

వృద్ధులకు డోర్‌ డెలివరీకి ఆటంకాలు

ఇదెంతకాలం?1
1/2

ఇదెంతకాలం?

ఇదెంతకాలం?2
2/2

ఇదెంతకాలం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement