నాణ్యత లేని ప్యాచ్ వర్కులు
ఉండి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో అధికారులు హడావుడిగా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. అయి తే ప్యాచ్ వర్కులు తూతూమంత్రంగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఉండి–గణపవరం రోడ్డులో కొంతకాలం క్రితం కోలమూరు–ఆరేడు రోడ్డు మర్మమతుల పనులు ముగించారు. కొత్త ఏడాదిలో ఉండి సెంటర్ నుంచి కోలమూరు వరకు పనులు చేపట్టారు. అయితే ఈ పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారని వాహనచోదకులు అంటున్నారు. గోతులు పూడ్చే సమయంలో మట్టిని పూర్తిగా తొలగించాల్సి ఉండగా కొన్ని ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదు. ఇష్టానుసారం గోతులు పూ డ్చుతున్నారు. గ్రావెల్ దానిపై తారు అతి తక్కు వగా వేసి పైన బేబీ చిప్స్ వంటివి వేసి మమ అనిపించేస్తున్నారు. దీని వల్ల ప్రజాధనం వృథా తప్ప అవుతుందని, కొద్దిరోజుల్లోనే గోతులు యథాతథంగా నిలిచి రోడ్డు సాధారణ స్థితికి వచ్చేయడం ఖా యమని స్థానికులు అంటున్నారు. పనులు జరిగే సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని చెబుతున్నారు.


