రుచి మధురం.. నాణ్యతలో ప్రథమం
అభిప్రాయ సేకరణ అంశాలు
సంతృప్తి.. అసంతృప్తి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న మధురమైన ప్రసాదానికి మొదటి ర్యాంక్ దక్కింది. అలాగే భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలో రెండో ర్యాంక్ లభించింది. రాష్ట్రంలోని ఏడు ప్రధా న ఆలయాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానా లు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ద్వారకాతిరుమల దేవస్థానానికి సంతృప్తికర ఫలితాలు వచ్చాయి. శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, అన్నవరం, విజయవాడ, సింహాచలం, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం గత నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకూ వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వేను నిర్వహించి, ర్యాంకులను ప్రకటించింది. ఇందులో శ్రీకాళహస్తి 71.2 శాతంతో మొదటి ర్యాంక్ సాధించింది. అలా గే ద్వారకాతిరుమల 70.7 శాతంతో రెండో ర్యాంక్, విజయవాడ 68.1 శాతంతో మూడో ర్యాంక్, అన్న వరం 67.9 శాతంతో నాల్గో ర్యాంక్, సింహాచలం 67.8 శాతంతో ఐదో ర్యాంక్, శ్రీశైలం 67.5 శాతంతో ఆరో ర్యాంక్, కాణిపాకం 66 శాతంతో ఏడో ర్యాంక్‌ను సాధించాయి. అయితే ప్రసాదాల నాణ్య త, రుచిలో మాత్రం ద్వారకాతిరుమల దేవస్థానా నికి మొదటి స్థానం లభించింది.
రుచి, శుచిలో మేటి
శ్రీవారి దేవస్థానం భక్తులకు లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి, వడ ప్రసాదాలను అందిస్తోంది. అలాగే నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందజేస్తోంది. నాణ్యత, రుచిలో ఈ ప్రసాదాలు అద్భుతమని భక్తుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ఆలయాల్లో ద్వారకాతిరుమల శ్రీవా రి ప్రసాదాలకు రుచి, నాణ్యతలో మొదటి స్థానం లభించింది.
డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన రాష్ట్రంలోని 15 ఆలయాల్లో ఉరుకుంద దేవస్థానానికి మొదటి ర్యాంక్ లభించింది. దేవస్థానాల వారీగా మోపిదేవికి 2వ, విశాఖపట్నంకు 3వ, వాడపల్లికి 4వ, చౌడేపల్లికి 5వ ర్యాంక్, పెంచలకోనకు 6వ ర్యాంక్, మహానందికి 7వ ర్యాంక్, తునికి 8వ ర్యాంక్, అరసవెల్లికి 9వ ర్యాంక్, పెనుగంచిప్రోలుకు 10వ ర్యాంక్, కదిరికి 11వ ర్యాంక్, పెదకాకానికి 12వ ర్యాంక్, బేతంచర్లకు 13వ ర్యాంక్, తిమ్మరాజుపాలెంకు 14వ ర్యాంక్, కసాపురానికి 15వ ర్యాంకులు లభించాయి.
దర్శనం సంతృప్తికరంగా జరిగిందా, లేదా.
ఆలయాల్లో మౌలిక వసతులు, తాగునీరు, వాష్ రూమ్‌లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు బాగున్నాయా, లేదా.
ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా, లేదా.
ఆలయాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ సంతృప్తికరంగా ఉందా, లేదా.
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో చినవెంకన్న దర్శనం సంతృప్తికరంగా జరిగిందని 71.5 శాతం మంది, జరగలేదని 28.5 శాతం మంది తెలిపారు. అలాగే తాగునీరు సదుపాయం, ఇత ర మౌలిక వసతులు బాగున్నాయని 65.5 శాతం మంది, బాగోలేదని 34.5 శాతం మంది తెలిపారు. ప్రసాదం తాజాగా, రుచిగా బాగుందని 81.7 శాతం మంది, బాగోలేదని 18.3 శాతం మంది తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని 66.4 శాతం మంది, బాగోలేదని 33.6 శాతం మంది తెలిపారు.
శ్రీవారి ప్రసాదానికి ఫస్ట్ ర్యాంకు
చినవెంకన్న దేవస్థానం అందిస్తున్న
సేవలకు భక్తుల సంతృప్తి
ప్రభుత్వం నిర్వహించిన వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెల్లడి
నాలుగు అంశాలపై సర్వే
రుచి మధురం.. నాణ్యతలో ప్రథమం
రుచి మధురం.. నాణ్యతలో ప్రథమం


