చిల్డ్రన్స్ పార్క్‌కు శంకుస్థాపన
భీమవరం (ప్రకాశంచౌక్): భవ్య భీమవరానికి శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ బీవీ రాజు ఫౌండేషన్ సహకారంతో పట్టణంలో రూ.1.60 కోట్ల వ్యయంతో విజ్ఞానం, వినోదాన్ని అందించే కట్టడాలు అందుబాటులోకి రానున్నాయి. అంబేడ్కర్ సర్కిల్ సమీపంలో 47 సెంట్లలో చిల్డ్రన్స్ పార్క్‌కు, 39 సెంట్లలో కమ్యూనిటీ లైబ్రరీ ప్రాజెక్ట్ నిర్మాణాలకు కలెక్టర్ సీహెచ్ నాగరాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు లైబ్రరీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, విష్ణు కాలేజ్ స్టూడెంట్స్ ఎఫైర్స్ డైరెక్టర్ పి.శ్రీనివాసరాజు, ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


