మారేనా కూటమి తీరు?
న్యూస్‌రీల్
పశ్చిమగోదావరి
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
2026
భీమవరంలో ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కరిస్తానని, డ్రెయిన్లు అభివృద్ధి చేస్తానని, భీమవరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇవేమీ పట్టాలు ఎక్కలేదు. పట్టణ ప్రజలు, జిల్లా కేంద్రానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– గాదిరాజు రామరాజు, భీమవరం
తాడేపల్లిగూడెం 40 ఏళ్ల నుంచి మార్కెట్ హబ్‌గా ఉంది. పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడేన్ని మార్కెట్ హబ్‌గా అభివృద్ధి చేస్తానని ఎన్నికల హామీని ఇవ్వడం హాస్యాస్పదం. ఎన్నికల సమయంలో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఒక్క హామీనీ అమలు చేయలేకపోయారు.
– గుండుమోగుల సాంబయ్య, పండ్ల వ్యాపారి, తాడేపల్లిగూడెం
కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం హామీని సీఎం చంద్రబాబు మరిచారు. దీంతో ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. అలాగే రూ. 1.50కే విద్యుత్ ఇస్తానన్న హామీనీ చంద్రబాబు అమలు చేయలేకపోయారు. హామీలు నిలబెట్టుకోవాలి.
– వేగేశ్న జయ రామకృష్ణంరాజు, ఆక్వారైతు, పెదఅమిరం
సాక్షి, భీమవరం: సాగుకు భరోసా కరువు.. ఆడపడుచులకు ఆర్థిక చేయూత ఇవ్వలేదు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు.. నిరుద్యోగ భృతి మాటెత్తలేదు.. సంక్షేమ పథకాలు అందక వ్యాపారాలు వెలవెల.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు హామీలు గుప్పించారు.. గద్దెనెక్కి 18 నెలలు గడుస్తున్నా అమలు మాటెత్తడం లేదు.. 2025 సంవత్సరాన్ని వంచనతో పాలించిన నాయకులు 2026లో అయినా హామీలు అమలు చేస్తారా అని జిల్లావాసులు నిలదీస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ జిల్లాకు ఇచ్చిన హామీలను ఈ ఏడాదైనా పట్టించుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.
జిల్లాకిచ్చిన హామీలెన్నో..
2024 సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్‌తో పాటు జిల్లాలో జరిగిన ప్రచార సభల్లో నరసాపురంలో వశిష్ట వారధి నిర్మిస్తామని, జిల్లా కేంద్ర భీమవరానికి డంపింగ్‌యార్డు సమస్య పరిష్కరిస్తామని, తాడేపల్లిగూడెంను మార్కెట్, ఎడ్యుకేషన్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తామని, ఆక్వా రంగానికి ఊతమిస్తూ కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని, జోన్లతో నిమిత్తం లేకుండా ఆక్వా రైతులందరికీ రాయితీపై యూనిట్ విద్యుత్ రూ.1.50లకే అందిస్తామని, ఏరియేటర్లపై రాయితీ ఇస్తామని కూటమి నాయకులు హామీలిచ్చారు. వీటితో పాటు విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాలను తెచ్చి రక్షిత నీటిని కుళాయిల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తామని, తణుకును పారిశ్రామికంగా అభివృద్ధి చేసి జిల్లా నుంచి వలసలను అరికడతామని, హైటెక్ టవర్ల నిర్మాణంతో ఇంటి నుంచే ఉద్యోగాలు చేసుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని, జిల్లాలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తామని, ఆకివీడులో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి లేదా ఫ్లైఓవర్ నిర్మిస్తామంటూ ఎడాపెడా హామీలిచ్చిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఈ ఏడాదైనా వాటిని పట్టాలెక్కించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
తణుకులో హైటెక్ టవర్లు నిర్మించి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. వర్క్ ఫ్రం హోం చేసుకునేలా సాంకేతికను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ఇంతవరకు ఆ ఊసే లేదు.
– దాసి రత్నరాజు, తణుకు
నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని పాలకొల్లు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు. ఏడాదిన్నర గడిచినా హామీ కార్యరూపం దాల్చలేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటికి ఎసరు పెడుతున్నారు. నిరుద్యోగ భృతి హామీని అమలుచేయాలి.
– కడిమి బాలరాజు, పాలకొల్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఆడబిడ్డ నిధి హామీ మాటే మరిచారు. 8 ఏళ్లు నిండిన మహిళ నుంచి 59 ఏళ్ల మహిళ వరకు నెలకు రూ.1,500 సాయం అందిస్తామని ఊరురా ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం మానేశారు.
–కర్రి సుభాషిణి, జెడ్పీటీసీ, పెనుమంట్ర
అధికారంలోకి రాగానే వశిష్ట వంతెన నిర్మిస్తామని నరసాపురంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వంతెన కోసం రూ.680 కోట్లు మంజూరు చేసింది. ఆ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టడం లేదు. కొత్త ఏడాదిలోనైనా ప్రారంభించాలి.
– యర్రా ఉమా శ్రీనివాస్, నరసాపురం
వంచన పాలన
ఎన్నికల హామీల అమలెప్పుడో..!
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూపులు
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువు
కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలంటున్న ఆక్వా రైతులు
కలగా వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణం
మారేనా కూటమి తీరు?
మారేనా కూటమి తీరు?
మారేనా కూటమి తీరు?
మారేనా కూటమి తీరు?
మారేనా కూటమి తీరు?
మారేనా కూటమి తీరు?
మారేనా కూటమి తీరు?
మారేనా కూటమి తీరు?


