బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు నన్నయ్య జట్టు ఎంపిక
తాడేపల్లిగూడెం : పట్టణంలోని ఆదికవి నన్నయ్య వర్సిటీ ఆవరణలో మంగళవారం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, పురుషుల ఇంటర్ కాలేజీయేట్, ఇంటర్ యూనిట్ జట్టు బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు నన్నయ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వందమంది పాల్గొనగా నాకౌట్, లీగ్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎస్‌కేవీటి.డిగ్రీ కళాశాల, డీఆర్‌జీ డిగ్రీ కళాశాల, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాకినాడ జట్లు ఎంపికయ్యాయి. తిరుచిరాపల్లిలో భారతీ దాసన్ విశ్వవిద్యాలయంలో 14వ ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ఎంపికై న జట్లు పాల్గొననున్నాయి. ఎంపికై న క్రీడాకారులకు తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరంలో శిక్షణ శిబిరం ఏర్పాటుచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు రాణించి విద్యాసంస్థకు పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ టి.అశోక్ కోరారు.


