సైబర్ వల
న్యూస్‌రీల్
రోడ్డు ప్రమాదాలు
ఈవీఎం గోడౌన్ తనిఖీ
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పీపీ రోడ్డులోని గోడౌన్‌్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు.
ఏడాదికాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను బెదిరించి వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేశారు. జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకున్న 30 ఘటనల్లో దాదాపు రూ.9 కోట్ల నగదును మళ్లించేశారు. ఏడాదికాలంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ రికార్డుల్లో నమోదైన మొత్తం వివిధ నేరాలు 5,076 కాగా మహిళలపై దాడులు, లైగింక వేధింపులు తదితర ఘటనలు 697, చోరీలు 516 ఉన్నాయి.
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి, భీమవరం/భీమవరం: గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో సైబర్ నేరాలు పెరిగాయి. 2024 సంవత్సరంలో 16 ఘటనల్లో రూ. 3 కోట్ల వరకు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. 2025లో డిజిటల్ అరెస్టులంటూ వృద్దులు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. సెప్టెంబరు నెలలో భీమవరానికి చెందిన వృద్ద దంపతులను డిజిటల్ అరెస్ట్ చేశామంటూ బెదిరించి దాదాపు రూ.99 లక్షలు కాజేశారు. నవంబరులో భీమవరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్‌ను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి బ్యాంకు ఖాతా నుంచి రూ.78.60 లక్షలు చోరీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 30 ఘటనలకు సంబంధించి రూ. 9 కోట్ల వరకు చోరీ అయినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోలీస్ స్టేషన్ల వరకు చేరని సైబర్ నేరాలు మరెన్నో. ఎస్పీ అద్నాన్ నయిం అస్మీ ఆధ్వర్యంలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరాలపై జిల్లా పోలీసులు పురోగతి సాధించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కేసు దర్యాప్తులో 14 మంది అంతర్‌రాష్ట్ర ముఠా గుట్టు రట్టుచేశారు. కంబోడియా కేంద్రంగా ‘కార్డ్ డీల్’ అనే పద్ధతిని ఉపయోగించి వీరంతా నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి రూ.42.1 లక్షల నగదు రికవరీతో పాటు రూ.19.9 లక్షల మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేయించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులకు సంబంధించి సైబర్ నేరగాళ్ల చేతికి అందకుండా మొత్తం రూ.96.92 లక్షల నగదు హోల్డ్‌లో పెట్టించారు.
జిల్లాలో 60 మంది నిందితులను అరెస్టు చేసి 1,236 కిలోల గంజాయిని ధ్వంసం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో 815 మందిపై, మూడు డ్రోన్లు సాయంతో 186 బహిరంగ మద్యపానం కేసులు నమోదుచేశారు.
ఏడాదిలో మొత్తం ప్రమాదాలు
512
మరణాలు చోటుచేసుకున్న ఘటనలు
216
గాయపడిన
ఘటనలు
296
రోడ్డు ప్రమాదాల్లో మృతులు
223 మంది
సైబర్ నేరాలు
30
చోరీ కేసులు
516
మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాల కేసులు
ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసులు
33
697
రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారు
432 మంది
మిగిలిన కేసులు దాడులు, అల్లర్లు, హత్యలు, ప్రమాదాలకు సంబంధించినవి
రూటు మార్చిన కేటుగాళ్లు
డిజిటల్ అరెస్టుల పేరుతో 30 ఖాతాల నుంచి రూ.9 కోట్ల ఖాళీ
ఏడాదిలో నమోదైన మొత్తం కేసులు 5,076
512 ప్రమాదాల్లో 223 మంది మృతి, 432 మందికి గాయాలు
1236 కేజీల గంజాయి ధ్వంసం
సైబర్ వల
సైబర్ వల
సైబర్ వల


