భీమవరం డీఎస్పీగా రఘువీర్ విష్ణు
భీమవరం: భీమవరం డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య బదిలీ అ య్యారు. ఆయన స్థానంలో కాకినాడ నుంచి రఘువీర్ విష్ణు డీఎస్పీగా నియమితులయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జయసూర్యపై విచారణకు అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. జయసూర్య తన పరిధిలో పేకాట క్లబ్బుల నిర్వహణ, కోడి పందేలు, ప్రైవేట్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన బందోబస్తుకు వెళ్లిన జయసూర్య గాయం కావడంతో సెలవులో ఉన్నారు. ఈ తరుణంలో జయసూర్యను వీఆర్‌కు పంపిస్తూ మంగళగిరి డీఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది.
భీమవరం: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి, సుపరిపాలన దినోత్సవం సందర్భంగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు భీమవరం విష్ణు కాలేజీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 300పైగా పా ర్లమెంట్ స్థానాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ 2014కు ముందు క్రీడాకారుల ఎంపికలో అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలేవని, గత దశాబ్ద కాలంలో ఆ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శకతను తీసుకువచ్చామని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం వ్యక్తిగత విజయం కోసమే కాకుండా దేశ గౌరవం కోసం, మువ్వన్నెల జెండా కీర్తిని విశ్వవ్యాప్తం చేయడం కోసం ఆడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆధ్వర్యంలో నరసాపురం పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఈనెల 23 నుంచి సంబరాల్లో భాగంగా క్రీడాకారులకు చెస్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ముగింపు వేడుకల్లో పోటీల్లో విజేతలకు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి బహుమతులు అందించారు.
ద్వారకాతిరుమల: ప్రభుత్వ పోరంబోకు భూమి కబ్జా వ్యవహారంపై టీడీపీ నేతలు దొంగాట ఆడుతున్నారు. భూకబ్జా నువ్వే చేశావంటే.. కాదు నువ్వే చేశావంటూ ఆరోపణలు చేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నా రు. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమల మండ లం తిమ్మాపురంలోని ఆర్‌ఎస్ నం.220లో 9 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు అధికారాన్ని అడ్డంపెట్టుకుని కబ్జా చేశారని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తూంపాటి పద్మవరప్రసాద్ ఆరోపించారు. భూమి లో చేపల చెరువు తవ్వతున్నారని అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై ‘సాక్షి’లో గురువారం ‘ఈ భూ కబ్జాను అడ్డుకునేదెవరూ?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో శ్రీనివాసరావు వర్గీయులు అసలు కబ్జాదారుడు పద్మవరప్రసాదే అంటూ ఆరోపణా స్త్రాలను సంధిస్తున్నారు. వరప్రసాద్ తన తల్లి సత్యవతి పేరున ఈ ఏడాది అక్టోబర్‌లో వివాదాస్పద భూమి తనదేనంటూ రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌కు పెట్టిన అర్జీ పత్రాన్ని శ్రీనివాసరావు వర్గీయులు బహిర్గతం చేశారు. హైకోర్టులో సైతం దీనిపై కేసు వేశారని చెబుతున్నారు. శ్రీనివాసరావు కబ్జా చేశారని చెబుతున్న అదే భూమి తనదంటూ వరప్రసాద్ తల్లి సత్యవతి పేరున అర్జీ ఎలా పెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఆర్‌ఎస్ నం.220లోని 11 ఎకరాల భూమిలో 5 ఎకరాల భూమిని దశాబ్దాల క్రి తం శ్రీనివాసరావు ఒక ఎక్స్ సర్వీస్‌మెన్ నుంచి కొనుగోలు చేశారని, భూమిలో కొంత దారులకు పోగా, మిగిలిన భూమిని వరప్రసాద్ కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు.
భీమవరం డీఎస్పీగా రఘువీర్ విష్ణు
భీమవరం డీఎస్పీగా రఘువీర్ విష్ణు


