బరితెగింపు ఆగేనా..?
కట్టడిపై దృష్టి సారించని వైనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమలో సంక్రాంతి కోడిపందేల సన్నాహాలకు తెరలేచింది. గ్రామాలవారీగా నిర్వహించుకునే చిన్నపాటి పందెం బరులు మొదలు కూటమి నేతలు ఏర్పాటు చేసే భారీ బరులు, అలాగే కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే తెరచాటు నిర్వాహకులుగా ఏర్పాటు చేసే పందెంబరులపై పోలీసులు దృష్టి సారించలేదు. ఇప్పటికే పల్లెల్లో సంక్రాంతి సందడి ప్రారంభమై వచ్చే వారం నుంచి అక్కడక్కడా కోడిపందేల నిర్వహణకు సన్నద్ధమవుతున్నా పోలీసులు మాత్రం కట్టడి దిశగా కనీస కార్యాచరణ ప్రారంభించలేదు.
రాష్ట్రంలోనే ఖ్యాతి : ఉమ్మడి పశ్చిమ కోడిపందేల నిర్వహణకు రాష్ట్రంలో ఖ్యాతిగాంచింది. తీవ్రస్థాయి అడ్డంకులు, కోర్టు ఉత్తర్వులు ఇలా ఎన్ని ఉన్నా చట్ట పరిధిలోబడి అంటూ ముసుగులో భారీ ఎత్తున కోడిపందేలు, పేకాట, గుండాట జూద క్రీడలు నిర్వహిస్తుంటారు. సాధారణంగా సంక్రాంతి మూడు రోజులు అంత సీరియస్‌గా తీసుకోకపోయినా మిగిలిన రో జుల్లోనైనా కట్టడి చేయాల్సిన పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం స్టేషన్ల వారీ వ్యవహారాలకు బైండోవరై యథేచ్ఛగా పందేల నిర్వహణకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రధానంగా సంక్రాంతి సీజన్ ప్రారంభంలో పందెంకోళ్ల పెంపకందారులపై కేసులు, గతంలో పందెం బరులు నిర్వహించినవారిపై, బెట్టింగ్‌రాయుళ్లు, కోడికత్తులు తయారీదారులపై బైండోవర్ కేసులు నమోదు చేసి విచ్చలవిడి క్రీడలు కొంత మేరకై నా కట్టడి చేసేవారు. ఈసారి అలాంటి చర్యలేవీ తీసుకోని పరిస్థితి. దీంతో అన్ని నియోజకవర్గాల్లో భారీ బరులకు మంతనాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నా యి. పేకాటకు, గుండాటకు కోడిపందేల బరులకు ఇ లా ఒక్కోదానికి ఆటస్థాయి బట్టి రేట్లు ఖరారు చేసి స్థానిక స్టేషన్ మొదలు ప్రజాప్రతినిధి వరకూ ఒక మొత్తాన్ని ఇచ్చేలా చర్యలు జోరుగా సాగుతున్నా యి. ఇక అధికార పార్టీ నాయకులే పూర్తిగా కోడిపందేల బరులు నిర్వహించేలా ఇప్పటికే మండలాల్లో ఖరారు చేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్ర ధానంగా తాడేపల్లిగూడెంలో ఒక బరి కేవలం రా యలసీమ నుంచి వచ్చే అతిథుల కోసం సన్నద్ధం చే స్తుండగా ఉండి, పాలకొల్లు, భీమవరం, ఉంగుటూ రు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీ బరులను ఏర్పాటు చేసేలా హడావుడి చేస్తున్నారు.
కోడి.. రె‘ఢీ’
పల్లెల్లో సంక్రాంతి బరులకు సన్నాహాలు
పొలిటికల్ బరులపై రెగ్యులర్ పంచాయితీలు
మొక్కుబడి కేసులకే పోలీసు శాఖ పరిమితం
ముందస్తు బైండోవర్లపై దృష్టి సారించని వైనం
కోడికత్తుల తయారీదారులపై తీసుకోని చర్యలు
గతంలో హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కోడిపందేల నియంత్రణకు నెల రోజు ల ముందు నుంచే చర్యలు తీసుకునేది. డిసెంబర్ 15 నుంచే పందెం నిర్వాహకులు, పేకాట, గుండాట, కోడికత్తుల తయారీదారులపై కేసులు నమోదు చేసేది. ఉమ్మడి పశ్చిమలో 2024లో 187 కేసులు, 360 మందికి నో టీసులు, 700ల మందికిపైగా బైండోవర్లు, 1,856 కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఏడాదిలో ఇంకా బైండోవర్లపై అధికారులు దృష్టి సారించని పరిస్థితి.


