గిరి ప్రదక్షిణకు శరవేగంగా ఏర్పాట్లు
ఎరువు దరువు
ప్రస్తుత రబీ సీజన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ్క ఎరువుల ధరలు పెంచడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. 8లో u
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సిబ్బంది గిరి ప్రదక్షిణ మార్గంలోని రాళ్లను తొలగించి, మట్టితో వాటిని పూడ్చివేశారు. ప్రస్తుతం బ్లేడ్ ట్రాక్టర్‌తో చదును చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. గోవింద స్వాములు, భక్తులు నడిచేందుకు వీలుగా ఈ మార్గంలో ఎండు గడ్డి వేయాలని అధికారులు నిర్ణయించారు. గోవింద స్వాములు ఇరుముడులు సమర్పించేందుకు బుకింగ్ కౌంటర్ల వద్ద హోమగుండాన్ని నిర్మించారు. దానికి పందిరి వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ, స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లపై దేవస్థానం ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి ఐదు రోజుల క్రితం ఆలయ ప్రధానార్చకులు పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు, ఈఈ డీవీ భాస్కర్, డీఈఓ వై.భద్రాజీ, డీఈ టి.సూర్యనారాయణ, ఏఈఓలు మెట్టపల్లి దుర్గారావు, పి.నటరాజారావు, ఐ.రమణరాజు, జి.ఉమాపతి, సూపరింటెండెంట్లు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు. ఈనెల 29న శ్రీవారి గిరి ప్రదక్షిణ స్వామివారి తొలిమెట్ట (పాదుకా మండపం) వద్ద ప్రారంభమవుతుందని ఈఓ తెలిపారు. అదేరోజు రాత్రి 7 గంటల నుంచి స్వామివారి నిజరూప దర్శనం, మరుసటిరోజు 30న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తామన్నారు.


