అధ్వాన రహదారిపై.. అదుపు తప్పి..
ఆకివీడు: అధ్వాన రహదారిపై మోటార్‌సైకిల్ అదుపు తప్పడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆకివీడు తెల్లవంతెన సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవంతెన వద్ద నుంచి చెరుకువాడ మంచినీటి చెరువు వరకూ రహదారి జాతీయ రహదారి అధ్వానంగా ఉంది. అధికారులు కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. దీంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మంగళవారం ఏలూరు జిల్లా కలిదిండి మండలం నుంచి భీమవరం వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్న పద్మ అనే మహిళ ప్రమాదవశాత్తూ తెల్లవంతెన సమీపంలో జారిపడి తీవ్ర గాయాలపాలైంది. ఆమెను 108లో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
ఉండి: అదనపు కట్నం వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉండి మండలం వెలివర్రు శివారు ప్రాంతం గరువులో తాటిపర్తి చిట్టెమ్మను ఆమె భర్త అదనపు కట్నం తీసుకురావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనిపై బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


