
మద్యం మత్తులో హత్యాయత్నం
తణుకు అర్బన్: మద్యం మత్తులో ఉన్న యువకుడు కత్తితో భార్యభర్తలపై దాడికి పాల్పడిన ఘటన తణుకులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు కొమ్మాయిచెర్వుగట్టు ప్రాంతంలో వినాయచవితి మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఊరేగింపులో జరిగిన వాగ్వాదంలో చుక్కా సంజయ్ అనే యువకుడు స్థానికంగా నివసిస్తున్న కొలుసు శంకర్, నాగమణి దంపతులపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. గత పదేళ్లుగా తణుకులో కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటున్న శంకర్‌కు, సంజయ్ పాత గొడవలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫూటుగా మద్యం సేవించి ఉన్న సంజయ్ బాఽధితుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడిచేసినట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ భార్యాభర్తలిద్దరినీ స్థానికులు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా వైద్యసేవలందిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పట్టణ ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
నూజివీడు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ నూజివీడుకు చెందిన అరిగెల అమృతవల్లి చేసిన ఆరోపణలు అవాస్తవమని కే సంధ్య, ఆమె సోదరుడు కే శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మా తల్లి ఇంట్లో గతంలో కొన్ని నెలలు అమృతవల్లి పనిమనిషిగా పనిచేసిందని, ఆ సమయంలో తన ఆర్థిక ఇబ్బందులు చెప్పి విదేశాల్లో ఏమైనా అవకాశాలుంటే తనకు సాయం చేయాలని కోరిందన్నారు. దీంతో తమ స్నేహితుడు డాక్టర్ సమీర్ ఖతార్‌లో ఉంటే ఆయన ద్వారా సాయం చేయడమే కాకుండా శ్రీకాంత్ సైతం కొంత డబ్బును ఆమెకు చేబదులుగా ఇచ్చాడన్నారు. దీంతో ఖతార్ వెళ్లిన ఆమె రెండు నెలల పాటు అక్కడ పనిచేసి జీతం కూడా తీసుకుందన్నారు. అయితే వీసా మార్పిడి, వర్క్ పర్మిట్ వంటి అవసరమైన వాటిని అమృతవల్లి చేసుకోలేక తిరిగి ఇక్కడకు రావాల్సి వచ్చిందన్నారు. తిరుగు ప్రయాణం టిక్కెట్ కూడా సమీర్ కొని పంపించాడని, కానీ అమృతవల్లి మాత్రం నష్టపోయినట్లు నటిస్తూ, తప్పుడు ఆరోపణలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు దండుకోవడానికి చూస్తోందన్నారు. ఆమె ఆరోపణలకు మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్, నాగమణి

మద్యం మత్తులో హత్యాయత్నం