
పక్షులు వేటాడుతున్న ఏడుగురి అరెస్ట్
నరసాపురం: లక్ష్మణేశ్వరం చేపల మార్కెట్ వద్ద పక్షులను వేటాడి విక్రయిస్తున్న ఓ బృందంపై గురువారం భీమవరం ఫారెస్ట్ రేంజ్ అధికారులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులు, కొంత గన్ పౌడర్, 13 మృత పక్షులను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను వేటాడటం, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై కేసు నమోదు చేసినట్టు భీమవరం ఫారెస్ట్ రేంజ్ మురాల కరుణాకర్ అధికారి చెప్పారు. వన్యప్రాణులను వేటాడటం, విక్రయించడం చట్టప్రకారం నేరమని హెచ్చరించారు.