
మట్టి విగ్రహాలే మేలు
భీమవరం (ప్రకాశంచౌక్): మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపా డాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, స్పేస్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన ‘పర్యావరణ అనుకూల వినాయక చవితి అవగాహన కార్యక్రమం’పై వాల్‌పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మట్టి విగ్రహాలే మేలని అన్నారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కె.వెంకటేశ్వరరావు మా ట్లాడుతూ మట్టి విగ్రహాలు, పత్రి ఉపయోగాలపై జిల్లావ్యాప్తంగా కళాజాతాలు నిర్వహిస్తున్నామన్నారు. స్పేస్ ఎన్జీఓ ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ మట్టి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఏఈ ఎస్.రమేష్, ఎన్.వెంకటరమణ, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశాకిరణ్, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి వై.దోసి రెడ్డి, ఆర్డీవో దాసి రాజు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో తీర ప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనపై అందిన ఫి ర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చే పట్టాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించా రు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో తీర ప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనకు సంబంధించిన మూడు అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. నరసాపురంలోని వశిష్ట గోదావరి నది ఒడ్డున ఘన వ్యర్థాలను పారవేయడంపై, నరసాపురం మండలం పీచుపాలెం, లక్ష్మణేశ్వరం గ్రామాల్లో అక్రమ రొయ్యల సాగు, మొ గల్తూరు మండలం కేపీ పాలెం సౌత్ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకం, అనధికార రొ య్యల చెరువు తవ్వకంపై ఫిర్యాదులు, వచ్చేనెల 20న నిర్వహించనున్న బీచ్ క్లీనింగ్ కార్యకలాపాలు, ప్రచారాలపై సమీక్షించారు.
భీమవరం: పరీక్షల నిర్వహణలో కొత్త మూల్యాంకన విధానం సమస్యలకు దారి తీస్తుందని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.ప్రకాశం, బీవీ నారాయణ మాట్లాడుతూ నూతన విధానం బోధనా సమయాన్ని హరిస్తుందన్నారు. మార్కుల నమోదు ఉపాధ్యాయులకు పని భా రంగా మారిందన్నారు. ఆన్‌లైన్ విధానంలో న మోదుకు మాత్రమే పరిమితం చేసి మిగిలిన న మోదు నుంచి వెసులుబాటు కల్పించాలన్నా రు. కొత్త విధానం వల్ల ఫలితాల కంటే నష్టమే ఎక్కువ ఉందన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు జి.ప్రసన్నకుమార్ రమేష్, నాగరత్నాలు, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఈనెల 23న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాల ని ర్వహణకు సిద్ధం కావాలని జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ వారం డ్రెయినేజీ క్లీనింగ్, పారిశుద్ధ్యం ప్రధానాంశంగా తీసుకున్నారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వం 55 స్వచ్ఛాంధ్ర అవార్డులను అక్టోబర్ 2న ప్రకటించనుందని, కార్యక్రమాల అమలులలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం ఎఫ్‌ఏసీ ఉప విద్యాశాఖాధికారిగా (డీవైఈఓగా) కే వీఎస్ రామాంజనేయులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రామాంజనేయులు నిడదవోలు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల హె చ్‌ఎంగా, చాగల్లులో ఎంఈఓగా పనిచేశారు. రామాంజనేయులకు ఎంఈఓలు హనుమ, జ్యోతి, జెడ్పీ హెచ్‌ఎం సత్యనారాయణ తదితరులు అభినందనలు తెలిపారు.

మట్టి విగ్రహాలే మేలు