
వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం కార్యదర్శిగా ధర్మరాజు
చింతలపూడి: వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన కుక్కల ధర్మరాజును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్సార్‌సీసీ బీసీ సెల్ కార్యదర్శిగా సూరిబాబు
పెంటపాడు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ విభాగ కార్యదర్శిగా పెంటపాడుకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సూరిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
చింతలపూడి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శులుగా చింతలపూడి మండలానికి చెందిన చిలుకూరి జ్ఞానారెడ్డి, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన మల్నీడి మోహనకృష్ణ(బాబి)లను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ సేవలను గుర్తించి రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తణుకు అర్బన్ : పార్కింగ్ చేసిన కారులో మంటలు చెలరేగిన ఘటన శనివారం తణుకు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన రుషి తన కుటుంబ సభ్యులతో తణుకు బ్యాంకు కాలనీలోని ఒక ప్రెవేటు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలంలో నానో కారు పార్కింగ్ చేసి ఆసుపత్రిలోకి వెళ్లారు. కొద్దిసేపటికే కారు నుంచి పొగలు వ్యాపించి నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్థమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.
చింతలపూడి: రాష్ట్ర స్థాయి ఆర్టిస్టిక్ యోగా పోటీలకు నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎస్.జాస్మిత ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.హేమలత తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో విద్యార్థులను సత్కరించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ ఈనెల 10న ఏలూరు లోని ఓల్డేజ్ హోంలో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎస్.జాస్మిత ఉత్తమ ప్రతిభ చూపి మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిందని చెప్పారు. మరో విద్యార్థిని అమలారాణి ట్రెడిషనల్ జూనియర్ యోగా పోటీలలో మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించిందన్నారు.
మల్నీడి మోహనకృష్ణ(బాబి)
చిలుకూరి జ్ఞానారెడ్డి

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం కార్యదర్శిగా ధర్మరాజు

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం కార్యదర్శిగా ధర్మరాజు

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం కార్యదర్శిగా ధర్మరాజు

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం కార్యదర్శిగా ధర్మరాజు

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం కార్యదర్శిగా ధర్మరాజు