ప్రజా గొంతును నొక్కొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజా గొంతును నొక్కొద్దు

May 9 2025 12:58 AM | Updated on May 9 2025 12:58 AM

ప్రజా

ప్రజా గొంతును నొక్కొద్దు

ప్రజల పక్షాన పోరాడే పత్రికల గొంతును నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ‘సాక్షి’ ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసుల నిర్బంధ సోదాలను ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛకు ఎవరూ భంగం కలిగించకూడదు. ఇటువంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించినట్లుగానే భావించాల్సి వస్తోంది. పత్రికా ఎడిటర్‌ స్థాయి వ్యక్తిని భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరం.

– దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌), వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు

జర్నలిజంపైనా దాడులు

ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాయకపోతే జర్నలిజంపైనా దాడులు చేసే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. రాజకీయ ఒత్తిళ్లతోనే బెదిరింపులకు పాల్పడినట్టుగా ఉంది. కూటమి పాలనలో అనుకూలంగా లేని పత్రికలు, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా నిర్వాహకులపై దాడులకు దిగడం పరిపాటిగా మారింది. రానున్న రోజుల్లో ఇవన్నీ మీకు రిటర్న్‌ గిఫ్ట్‌లుగా వస్తాయి.

– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి

ప్రశ్నిస్తే కేసులు పెడతారా ?

‘సాక్షి’ ఎడిటర్‌ ఇంటిపై పోలీసులు దాడి ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోదాలు సరి కాదు. ‘సాక్షి’పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇటువంటి చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలి.

– తెల్లం రాజ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ పోలవరం సమన్వయకర్త

ప్రజా గొంతును నొక్కొద్దు  
1
1/2

ప్రజా గొంతును నొక్కొద్దు

ప్రజా గొంతును నొక్కొద్దు  
2
2/2

ప్రజా గొంతును నొక్కొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement