ఆపరేషన్ సిందూర్.. సరైన నిర్ణయమే
ఉండి: పాకిస్థాన్‌లోని తీవ్రవాదులపై భాతర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సరైన చర్య అని మాజీ సైనికోద్యోగి హవల్ధార్ దంగేటి రామలింగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పహల్గాం ఘటన తనను ఎంతగానో కలచివేసిందని, పాకిస్థాన్ ఉగ్రమూకలు అభాగ్యులను నిర్ధాక్ష్యిణ్యంగా చంపడం చాలా చాలా దారుణమన్నారు. దీనికి బదులుగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు తన సెల్యూట్ తెలియజేశారు. టెర్రరిజంపై భారత్ పోరాటం నిజమైనదని అందుకే ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయని అన్నారు. రిటైర్డ్ అయిన మా సేవలు అవసరమైతే మేమంతా సిద్ధంగా ఉంటామని, ఇది మాజీ సైనికోద్యోగుల పక్షంగా తాను చెబుతున్నానని తెలిపారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఎక్కువగా జనం ఎక్కడైతే వుంటారో ఆక్కడే టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని జాగ్రత్తగా ఉండాలన్నారు. గేటెడ్ కమ్యూనిటీ వారంతా అప్రమత్తంగా వుండాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరైనా కొత్తవారు అనుమానితులుగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మాజీ హవల్ధార్ తెలిపారు.


