పేరుకే కూటమి పెత్తనం టీడీపీదే
శోభాయమానం
వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు ద్వారకాతిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయాన్ని, పరిసరాలను శోభాయమానంగా అలంకరించారు. 8లో u
ఒప్పందాలకు పాతర
బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమలో భీమవరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో టీడీపీ దెబ్బకు జనసేన ఎమ్మెల్యేలు విలవిల్లాడుతున్నారు. పేరుకు ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా టీడీపీ నేతలదే కావడంతో చేసేది లేక సైలెంట్‌గా ఉంటున్నారు.
చెల్లుబాటు కాని ధర్మరాజు మాట
ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధి పత్సమట్ల ధర్మరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే నియోజకవర్గంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉన్నారు. నియోజకవర్గంలోని ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు మండలాలు ధర్మరాజు చూసుకునేలా, భీమడోలు మండలం గన్ని వీరాంజనేయులు చూసు కునేలా గెలుపొందిన అనంతరం మాట్లాడుకున్నారు. కట్‌చేస్తే.. అన్ని మండలాల్లోనూ టీడీపీ కేడర్ ఎమ్మె ల్యేను ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు పనుల్లో పర్సంటేజీలు తీసుకుంటున్నారు. అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియా వేదికగా హడావుడి చేయడంలో టీడీపీది కీలక పాత్ర. తాజాగా నియోజకవర్గంలో 50 శాతం పనులు, పదవులు, బెల్టు షాపు ఆదాయాలు, కొల్లేరు అక్రమ సాగు అంతా టీడీపీకి కట్టపెట్టాలని డిమాండ్‌తో దాదాపు సగం సొంతం చేసుకున్నారు. మిగిలిన 50 శాతంలో 40 శాతం జనసేన, 10 శాతం బీజేపీ తీసుకోవాలని ప్రతిపాదన పెట్టారు. ఉదాహరణకు రూ.11.99 కోట్ల విలువైన స్వయం ఉపాధి పథకం రుణాలు 240 టీడీపీకి ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేకు అల్టిమేటం ఇచ్చారు. నియోజ కవర్గంలో 17 సొసైటీలు ఉంటే, 9 సొసైటీలు టీడీపీ తీసుకుని, 7 జనసేనకు, ఒకటి బీజేపీ పంచుకోవాలని టీడీపీ నేతలే తీర్మానం చేశారు. జనసేన కోసం పనిచేసిన కేడర్ ఎమ్మెల్యే కార్యాలయానికి పనుల కోసం వచ్చినప్పటికీ ఏమీ చేయలేని పరిస్ధితి. ఏం చేయాలన్నా టీడీపీతో సంప్రదింపులు అనివార్యం.
న్యూస్‌రీల్
ఉంగుటూరులో షాడో ఎమ్మెల్యేగా గన్ని వీరాంజనేయులు
భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో షాడోగా టీడీపీ నేతలు
పనులు, పర్సంటేజీలు, లిక్కర్, గ్రావెల్‌లో టీడీపీదే అగ్రభాగం
గూడెంలో పట్టుకోసం టీడీపీ పాకులాట
జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి మధ్య మాటల యుద్ధం
కూటమి గెలుపొందాక ముఖ్య నేతల మధ్య పదవుల పంపకాల్లో మౌఖిక ఒప్పందాలు జరిగాయి. ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నచోట ఆ పార్టీకి తొలి ప్రాధాన్యం.. మిగిలిన రెండు పార్టీలకు తదుపరి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. కట్ చేస్తే... జనసేన ఎమ్మెల్యేలకు టీడీపీ చుక్కలు చూపిస్తోంది. ఉంగుటూరులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, భీమవరంలో ఇద్దరు టీడీపీ నేతలతో మాట్లాడిన తరువాతగాని ఎమ్మెల్యేను కలిసే పరిస్థితి లేదనే చర్చ బలంగా సాగుతుంది. తాడేపల్లిగూడెంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జిల మధ్య ఆదిపత్య పోరులో భాగంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఇద్దర్ని పిలిచి సెటిల్‌మెంట్ చేసినప్పటికీ గొడవ సద్దుమణిగినట్లు లేదు.
పేరుకే కూటమి పెత్తనం టీడీపీదే


